జమ్మూకశ్మీర్‌లోని రెండు సంస్థలను నిషేధించిన కేంద్రం

జమ్మూ కశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న రెండు సంస్థలపై కేంద్ర హోం శాఖ కొరడా ఝలిపించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆ రెండు సంస్థలపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్టు వేర్పేరు ప్రకటనల్లో తెలిపింది. అవామీ యాక్షన్ కమిటీ (AAC), జమ్మూకశ్మీర్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ (JKIM) సంస్థలను చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద నిషేధిత సంస్థలుగా ప్రకటిస్తున్నట్టు పేర్కొంది. అవామీ యాక్షన్ కమిటీకి ఉమర్ ఫరూక్ సారథ్యం వహిస్తుండగా, జేకేఐఎంకు మసూర్ అబ్బాస్ సారథ్యం వహిస్తున్నారు.

ఏఏసీ, జేకేఐఎంలు జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ భారత వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నాయని ఎంహెచ్ఏ అధికారిక ప్రకటనలో పేర్కొంది. సాయుధ చొరబాట్లు, అంశాంతి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అశాంతి రెచ్చగొడుతున్నట్టు తెలిపింది. జాతి వ్యతిరేక ప్రసంగాల చేయడం, హింసను ప్రేరేపించడం, రాళ్లు రువ్వడం వంటి ఘనటనల్లో ఉమర్ ఫరూక్, ఇతర సభ్యుల ప్రేమయంపై అనేక కేసులు నమోదుకావడాన్ని ప్రస్తావించింది. మసూర్ అబ్బాస్ నేతృత్వంలోని జేకేఐఎం జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ, భారత వ్యత్రిరేక ప్రచారం, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తోందని తెలిపింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం ఆ సంస్థ సభ్యులు నిధులు సేకరిస్తున్నటు పేర్కొంది. ఆయా కారణాల దృష్ట్యా 1967 చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద రెండు సంస్థలపైన ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తు్న్నట్టు ఎంహెచ్ఏ స్పష్టం చేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *