తేనె గురించి సంపూర్ణ వివరణ-2

ముందు సంచికలో తేనెలో రకాలు, తేనె సేవించటం వలన తగ్గే వ్యాధుల గురించి చదివాం. ఇప్పుడు తేనెలోని మరికొన్ని రకాల గురించి చూద్దాం.

అర్ఘ్యం అనే తేనె : దీనిని పెద్దజాతికి చెందిన కొన్ని తేనెటీగలు పెడతాయి. పసుపుపచ్చ రంగులా కనిపిస్తుంది. వగరు కలిగి ఉంటుంది. కొంచం చేదు అనిపించును. ఇది చాలా బలాన్ని ఇస్తుంది. వాతము, పిత్తము, శ్లేష్మము మూడింటిని హరిస్తుంది.

చాద్రం అనే తేనె : ఇది పసుపు, నలుపు రంగులు కలగలసి ఉంటుంది. మామూలు తేనె కన్నా ఇది చాలా చిక్కగా, తీపి ఎక్కువ ఉంటుంది. రక్తపిత్త రోగములు, పిత్త రోగములు, క్రిమిరోగములు పోగొడుతుంది. మందులకు అనుపానముగా (మందులతోపాటు వేసుకునేందుకు) అత్యంత శ్రేష్టమైనది. ఇది హిమత్పర్వత ప్రాంతాలలో లభిస్తుంది. తక్కిన ప్రాంతముల దొరకడం చాలా కష్టం. ఇది ఎక్కువ మోతాదు తీసుకోకూడదు. అతిదాహాన్ని కలిగిస్తుంది.

చిన్నపువ్వు తేనె : ఒక విధమైన చెట్లలో మామూలు తేనెటీగలు కాక ప్రత్యేకమైన ఒక జాతి ఈగలు పెట్టె తేనెతుట్టెలో ఇది ఉంటుంది. ఇది మామూలు తేనెలాకాక పలుకులు పలుకులుగా ఉంటుంది. ఎలాంటి మేహరోగాలైనా ఇది తగ్గిస్తుంది. నాలుకకు రుచి లేకపోవటం, జలుబు, మధుమేహము వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఈ తేనెను కొందరు ‘‘మధుశర్కర’’ అని పిలుస్తారు. అమితమైన తియ్యగా ఉంటుంది. వాతము, మేహము, ఉన్మాదము, గ్రహణి రోగములను, రక్తపిత్త రోగాలను నయం చేస్తుంది. చాలా శ్రేష్టమైనది. దొరకడం చాలా కష్టం.

– ఉషాలావణ్య పప్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *