సనాతన ధర్మం శాశ్వతమైంది : హోసబళే

సనాతన ధర్మం అనేది శాశ్వతమైందని, అది ఎప్పటికీ నశించదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. సనాతన ధర్మం అనేది ఈ జాతి ఆత్మ అని, చైతన్యం అని అన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యల నేపథ్యంలో దత్తాత్రేయ పై విధంగా అన్నారు. ఓ జాతీయ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విధంగా స్పందించారు. సనాతనం అనేది ఓ మతపరమైన ఆచారం కాదని, అదొక విలువ అని, శాశ్వతమైందని, శాశ్వతత్వమే సనాతనం అని అన్నారు. అయితే.. ఉదయ నిధి స్టాలిన్ మాట్లాడిన వ్యాఖ్యలపై ఏం స్పందిస్తారని విలేకరి అడగ్గా.. అది ఆయన అభిప్రాయం. ఎన్నికల్లో ప్రజలు సమాధానం ఇచ్చారు అని అన్నారు.
సనాతన ధర్మం అనేది మర్రి చెట్టు లాంటిదని, 200 ఏళ్ల తర్వాత కూడా నిలబడే వుంటుందన్నారు. దాని వేర్లు మరింత బలంగా, లోతుగా ఉంటాయి. ఆ చెట్టు ఎప్పుడూ వుంటుందన్నారు.
ఇక.. బెంగాల్ ఎన్నికల ఫలితాలపై హోసబళే స్పందిస్తూ.. బెంగాల్ లో ప్రతి హిందూ ఓటరూ ఓ హిందూ కార్యకర్తగా మారిపోయారన్నారు. బంతికి ఎంత బలంగా గోడకుకొడితే, అంతే బలంగా తిరిగి వస్తుందన్న సూత్రాన్ని అక్కడ ప్రతిబింబించారన్నారు.
ఇక.. లవ్ జిహాద్ పై కూడా స్పందించారు. హిందూ యువతులను అపహరించుకోవాలనే ఏకైక అజెండాతో, పథకం ప్రకారం పన్నని కుట్రే లవ్ జిహాద్ అని అభివర్ణించారు. ఇది ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదన్నారు. కేవలం ఒక వైపు నుంచి మాత్రమే వస్తే అది ప్రేమ అని అనిపించుకోదని, అది కచ్చితంగా కుట్రే అని తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *