స్వావలంబి దిశలో వనవాసి మహిళలు… ”కార్తుంబి గొడుగు”ల తయారీతో ప్రసిద్ధి

వానాకాలం వచ్చేసింది. అయితే దేశమంతా ఇప్పుడు ఓ గొడుగు గురించే చర్చ జరుగుతోంది. ఆ గొడుగులు కార్తుంబి గొడుగులు. కేరళ కేంద్రంగా వనవాసీలు వీటిని తయారు చేస్తుంటారు. కేరళ సంసఋ్కతిలో వీటికి ప్రత్యేక స్థానం వుంది. అక్కడ అనేక సంప్రదాయాలు, ఆచారాలలో ఈ గొడుగులు ఓ ముఖ్యమైన భాగంగా చెబుతుంటారు. ఈ కార్తుంబి గొడుగులు కేరళలోని అట్టప్పాడిలో తయారు అవుతాయి. దేశ వ్యాప్తంగా వీటికి డిమాండన వుంది. ఆన్ లైన్ లో కూడా ఈ గొడుగులను విక్రయిస్తుంటారు. తాజాగా జరిగిన మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ గొడుగుల గురించి ప్రస్తావించారు. రంగు రంగుల గొడుగులు అద్భుతంగా వున్నాయని, గిరిజన మహిళలు వీటిని తయారు చేశారంటూ ప్రశంసించారు. దీంతో వీటి గురించే చర్చ అంతా నడుస్తోంది. అట్టపాడి కేంద్రంగా వనవాసీ మహిళలు ఇప్పటి వరకు 3 లక్షల గొడుగులను తయారు చేశారు.

అయితే… ఈ గొడుగులు ఇలా ప్రపంచంలోకి రావడానికి ఓ బలమైన కారణం వుందని అధికారులు చెబుతుంటారు. అట్టపాడిలోని వనవాసీ మహిళలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడేవారు. దీంతో చాలా మంది తల్లులు అనారోగ్య శిశువులకు జన్మనివ్వడం, వారు మరణించడం నిత్యక్రుత్యమైంది. దీంతో ఎలాగైనా వనవాసీ మహిళల ఆరోగ్యాన్ని మెరుగు పరిచి, శిశు మరణాలను తగ్గించాలని అక్కడి అధికారులు భావించారు. దీంతో వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి,వారి ఆర్ధిక పరిస్థితులను మెరుగుపచడానికి ఆదాయ వనరుల వైపు దృష్టి మళ్లింది. దీంతో ఈ గొడుగుల తయారీ ఆలోచన వచ్చింది. దీనికి వనవాసీ మహిళలు కూడా ముందుకు వచ్చారు.

కర్తుంబి…. అట్టప్పాడిలో వనవాసీ పిల్లలకి సంబంధించిన ఓ సాంస్కతిక బృందం. గొడుగుకి కూడా ఈ పేరునే బ్రాండ్ గా పెట్టుకున్నారు. 2014 లో ఈ గొడుగులను తయారు చేయడం ప్రారంభమైంది. మొట్ట మొదట కేవలం 50 మంది వనవాసీ మహిళలే తయారు చేయడానికి ముందుకు రావడంతో వారికి మాత్రమే శిక్షణ ఇచ్చారు. ప్రారంభ మూడేళ్లలో దుబాయనకి చెందిన పీస్ కలెక్టివ్ ఈ ప్రాజెక్టుకి ఆర్ధిక సాయాన్ని అందించింది. 2017 లో రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంస్థ 17 లక్షల సాయం చేసింది. 2014 లో కేవలం 1,000 గొడుగులే తయారీ చేస్తుండగా… 2024 నాటికి 17 వేల గొడుగులను విక్రయించే స్థాయికి ఎదిగింది. అలాగే దీనిని నేర్చుకునే వనవాసీ మహిళల సంఖ్య కూడా పెరిగింది. 50 నుంచి 360 కి చేరుకుంది. ఇప్పుడు వనవాసీ మహిళలకు ఈ గొడుగుల తయారీయే జీవనోపాధి అయి కూర్చుంది. అలాగే ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *