ఒక్కడే అందర్నీ కదిలించాడు… నాగావళి నదిని వ్యర్థాల నుండి కాపాడాడు

ఒకే ఒక్కడు. నాగావళి నది స్వచ్ఛత కోసం ఏకదాటిగా, అత్యంత శ్రద్ధతో పనిచేస్తున్నాడు. ప్లాస్టిక్‌ నుంచి, ఇతర వ్యర్థాల నుంచి నాగావళి నదిని, పరిసర ప్రాంతాలను ఎలాగైనా రక్షించాలని ఆయన నడుం బిగించాడు. ఆయన పేరు జీవన్‌. శ్రీకాకుళం నగరానికి చెందిన హడ్కో కాలనీలో జీవన్‌ అనే వ్యక్తి నాగావళి నది పరిశుభ్రత కోసం నడుంబిగించాడు. ముందు నుంచి కూడా జీవన్‌కి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తగిన పనులు చేయడం ఆయనకు అలవాటు. నాగావళి నదిపై నిర్మించిన వంతెనను దాటి… తన అమ్మమ్మ ఇంటికి వెళ్లడం తన అలవాటని చెప్పారు. ఆ సమయంలోనే నాగావళి నదిలో, పరిసర ప్రాంతంలో అక్కడి వారు చెత్తా చెదారాన్ని వేయడం తాను గమనించేవాడినని తెలిపాడు. ఇదంతా చూసి… తనకెంతో బాధగా వుండేదని, నది అత్యంత పవిత్రమైందని, అందుకే నాగావళిని నదిని, పరిసర ప్రాంతాలను రక్షించేందుకు తాను నడుం బిగించానని వెల్లడిరచారు. ‘‘సేవ్‌ ది నాగావళి…. నాగావళి నదిని వ్యర్థాల నుంచి రక్షించండి’’ అన్న ట్యాగ్‌లైన్‌తో ఓ ఉద్యమం లాంటిదే ప్రారంభించారు. దీనిని సోషల్‌ మీడియాలో కూడా వేగంగా విస్తృతి వచ్చేలా చూశారు. దీంతో కొందరు స్పందించడం మొదలు పెట్టారు.

 

ఓ వైపు సోషల్‌ మీడియాలో ఇదంతా చేస్తూనే… నాగావళి నది ప్రశస్తి, దాని ప్రాముఖ్యత, పర్యావరణ ప్రాముఖ్యత, ప్లాస్టిక్‌ భూతం… ఇలా మొత్తం వీటికి సంబంధించిన వ్యాసాలు కూడా రాయడం ప్రారంభించారు. ప్రతి ఆదివారం ‘‘క్లీన్‌ నాగావళి’’ పేరుతో నిర్వహించాలని కూడా వెల్లడిరచారు. దీంతో ప్రజలు ఆయన చేస్తున్న పనులు, రాతలతో ప్రభావితులయ్యారు. అందరూ తనతో కలిసి రావాలని, నాగావళి నదిని రక్షించుకుందాం అంటూ పిలుపునివ్వడంతో స్పందన వచ్చింది. సాధారణ పౌరులతో పాటు శ్రీకాకుళం మున్సిపల్‌ కమిషనర్‌, అక్కడి వైద్యాధికారులు ముందుకు వచ్చారు. నదిని శుభ్రం చేయడానికి తమ ససబ్బందిని పంపారు. అధికారులు మాత్రమే కాకుండా జీవన్‌కి సహాయపడిన వారిలో ససద్ధార్థ ప్రమోద్‌ నాయుడు, యోగేషష నాయుడు, మధు, హరికేషష, ప్రణీత్‌, దుష్యంత్‌. ప్రతి ఆదివారం రోజున క్లీన్‌ నాగావళి పేరుతో నిర్వహించే కార్యక్రమానికి వీరు కూడా పని చేశారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకి నాగావళి ప్రాణాధారం లాంటిదని, నాగావళి నదిని రక్షించుకోవడానికి అందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *