‘‘ఆపరేషన్ మహాదేవ్’’: పహల్గాం ఉగ్రదాడికి బాధ్యులైన ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదుల హతం
భారత సైన్యం అతిపెద్ద విజయం సాధించింది. జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ ప్రాంతంలోని దచిగామ్ లో పాక్ ప్రేరేపిత ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదలను భద్రతా దళాలు కాల్చి చంపేశాయి. ఈ ఆపరేషన్ కి ఆర్మీ ‘‘ఆపరేషన్ మహాదేవ్’’ అని నామకరణం చేసింది. ఈ ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులూ లష్కరే తోయబాతో సంబంధమున్నవారేనని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. అయితే.. పహల్గాం ఉగ్రదాడిలో ఈ ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదుల ప్రమేయం వుందని భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి. అయితే మరింత లోతుగా వీరి ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నామని భారత సైన్యం పేర్కొంది.
ఈ ఆపరేషన్ మహాదేవ్ ను జమ్మూ కశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా చేపట్టింది. హర్వాన్ ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో గత నెల రోజులుగా గాలింపు చేపట్టారు. చివరికి నేడు దాచిగమ్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతుండగా భద్రతా దళాలపైకి ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది.