నల్ల మట్టే ఇప్పుడు అక్కడ బంగారం..
పసుపు పంటకి గిరాకీ బాగా పెరగడంతో నల్ల మట్టికి కూడా బాగా గిరాకీ పెరిగింది. పసుపు పంట సాగు చేసే రైతులు ఇప్పుడు దీనిపై దృష్టి సారించారు. తమ భూముల్లో నల్ల మట్టిని అధికంగా వేయించుకుంటున్నారు. ఈసారి పసుపు పంటకు బాగా గిరాకీ రావడంతో వచ్చే యేడాది కోసం ఇప్పటి నుంచే నల్ల మట్టిని సమకూర్చుకుంటున్నారు. భీమ్‌గల్, ఆర్మూర్, బాల్కొండ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు నల్లమట్టే బంగారం. చుట్టుపక్కల వున్న చెరువుల నుంచి దీనిని సేకరిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు కూడా దీనిని తరలిస్తున్న నేపథ్యంలో దీని ధర బాగా పెరిగిపోయింది. టిప్పర్ ధరకి దాదాపు 12వేల రూపాయల ధర పలుకుతోంది. దగ్గర్లోనే వున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కూడా నల్లమట్టిని తరలిస్తున్నారు. అయినా… ధర తగ్గడం లేదు.