మానవ హక్కులకు పెద్దపీట వేసిన సనాతన ధర్మం

ప్రతి మనిషికీ హక్కులనేవి ప్రాథమికమైనవి. పౌరులు స్వేచ్ఛ, సమానత్వం, గౌరవంతో జీవించడానికి ఈ హక్కులు ఎంతో సహాయకారిగా వుంటాయి. గౌరవంతో, స్వేచ్ఛతో జీవించడానికి కావాల్సిన పరిస్థితులను కల్పించబడతాయి. ఎవ్వరూ భయపడకుండా సమాజంలో సమానత్వంతో, గౌరవ భావంతో జీవించే వాతావరణాన్ని మానవ హక్కులు సృష్టిస్తాయి. మానవ హక్కులు అనే భావన ప్రపంచంలో పురాతన కాలం నుంచి కూడా ఏదో ఒక రూపంలో ఉనికిలోనే వున్నాయి. కాకపోతే… వాటికి వివిధ రూపాలు వుండొచ్చు. వాటి సారం మాత్రం మానవ హక్కే. నాగరికత ఎంత అభివృద్ధి చెందిందో, మానవ హక్కులు కూడా అదే క్రమంలో అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి.
ప్రపంచంలో రెండు యుద్ధాల బీభత్సం కారణంగా లక్షలాది మంది అమాయకుల ప్రాణాలు పోయాయి. చాలా విధ్వంసం జరిగింది. ఈ క్రమంలో ప్రపంచ స్థాయిలో ప్రాంతం, మతం, లింగం, భాష తదితర గుర్తింపులు కాకుండా… మొత్తం మానవ జాతికి సంబంధించి ప్రాథమిక హక్కులు వుండాలని నిర్ణయించారు. దీంతో డిసెంబర్ 10, 1948 న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన జరిగింది. డిసెంబర్ మాసం, 1950లో ఇదే జనరల్ అసెంబ్లీ, ప్లీనరీ సెషన్‌లో ఐక్యరాజ్య సమితిలోని అన్ని సభ్య దేశాలు మానవ హక్కులకు సంబంధించిన తీర్మాన్ని ఆమోదించాయి. డిసెంబర్ 10వ తేదీని ప్రపంచ మానవ హక్కుల దినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ప్రకటన 500 కంటే అధిక భాషల్లోకి తర్జుమా జరిగింది. ఈ బాధ్యత అమలు మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ద్వారా జరిగింది. అంతేకాకుండా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది.
ప్రపంచ స్థాయిలో మానవ హక్కులను నిలబట్టే ప్రయత్నంలో భాగంగా ప్రతి సంవత్సరం ఓ విషయం ఆధారంగా ఓ థీమ్‌ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా వివక్షను రూపు మాపడం, పేదరికంపై పోరు, మానవ హక్కుల ఉల్లంఘనకు గురైన బాధితులను రక్షించడం లాంటి కార్యక్రమాలు చేపడతారు. ప్రపంచంలోని పౌరులందరికీ స్వాభావికంగా సంక్రమించే గౌరవం, సమానత్వం, హక్కుల ద్వారా ప్రపంచంలో స్వేచ్ఛ, న్యాయం, శాంతికి పునాదులు పడేలా రూపకల్పన జరిగింది. ఇవన్నీ ఆచరణలో వుంటే ప్రపంచ శాంతియుతంగా వుంటుందనేది దీని లక్ష్యం.
అయితే రానూ రానూ మానవ హక్కుల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణి ప్రబలిపోయింది. దీంతో అనాగరిక చర్యలు జరుగుతున్నాయి. పౌరులపై హింస, మానవుల వాక్ స్వాతంత్రాన్ని హరించడంతో అసలు వీటిపై విశ్వాసమే లేని స్థాయికి పడిపోతున్నాం. కానీ సాధ్యమైనంత వరకూ మానవ హక్కులను రక్షించడం, నిర్భయంగా జీవించడం, మాములు స్థాయిలో వుండే పౌరుని ఆకాంక్షలు అమలయ్యేలా చూడాలి. ప్రతి మనిషికి, స్త్రీలైనా, పురుషులైనా వారి ప్రాథమిక హక్కులు, సమానత్వంపై మాత్రం నమ్మకం వుండేలా ఐరాస ప్రయత్నిస్తుంది. సాధ్యమైనంత వరకు విస్తృత స్థాయిలో స్వేచ్ఛ, సామాజిక పురోగతి, మెరుగైన జీవన ప్రమాణాలను ప్రోత్సహించాలని నిర్ణయించారు.సభ్య దేశాలు ఐక్యరాజ్యసమితి సహకారంతో మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల పట్ల సార్వత్రిక గౌరవాన్ని ప్రోత్సహిస్తామని, సాధిస్తామని ప్రతిజ్ఞ కూడా చేశాయి.
ప్రాచీన భారతంలో మానవ హక్కులు….
భారతీయ సంప్రదాయంలో మానవ హక్కులు గొప్ప స్థానాన్ని ఆక్రమించాయి. పురాతన కాలం మొదలు, ఇప్పటి ఆధునికం వరకూ నైతిక భావనలు, రచనలు, సాహిత్యం రెంటిలోనూ ఈ హక్కులు అగ్రభాగంలో వున్నాయి. ఋగ్వేదం మొదలు రామచరిత మానస్ వరకూ మానవ హక్కులు అనేవి ప్రతిధ్వనిస్తూనే వున్నాయి. సనాతన సంప్రదాయంలో, భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో, జానపద సాహిత్యం…. ఇలా అన్ని రకాల సాహిత్యాలలో ప్రాచీన కాలం నుంచి ప్రాథమిక హక్కలనేవి ప్రస్ఫుటంగా ద్యోతకం అవుతూనే వున్నాయి. కానీ కాలక్రమేణా విదేశీ ఆక్రమణదారులతో సమాజాన్ని బలవంతంగా ఆక్రమించడం, వారిని ఏమార్చడం, రాజకీయాల కారణాల రీత్యా మానవ హక్కులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయాయి. దీంతో భారత రాజ్యాంగంలో మానవ హక్కులు అనేవి స్పష్టంగా పేర్కొన్నారు. హక్కు అనేది ప్రాథమిక హక్కుల్లో చూపించారు. మానవ హక్కుల పట్ల భారతీయ హిందూ విధానం చూసే దృష్టికోణాన్ని ఐరాసతో సహా వివిధ అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి, ఆమోదించాయి కూడా.
ఇంతే కాకుండా ఇది కాకుండా, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, జాన్స్ హాప్‌కిన్స్, హార్వర్డ్ మొదలైన ప్రపంచంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో మానవ హక్కులపై హిందూ దృక్పథాన్ని అధ్యయనం చేయడం కూడా జరుగుతోంది. భారతీయ పరంపర అనేది సామాజిక న్యాయం అన్న పునాదులపై వుంది. అందులో ఎక్కువ, తక్కువ అన్న తేడాయే లేదు. ఆలోచనల్లో స్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛ అనేవి భారతీయ సంప్రదాయంలో అన్ని యుగాల్లోనూ అగ్రభాగాన నిలిచాయి. సమస్త ప్రాణులను రక్షించడం, శిక్షలు విధించే సమయంలో న్యాయం, గ్రంథాలు నిర్ణయించిన ప్రకారం రక్షించడం, తప్పుదారిలో వుండే పౌరులను సరైన దారిలో పెట్టడం రాజు బాధ్యత అని గౌతమ ధర్మ సూత్రంలో స్పష్టంగా వుంది. అలాగే కౌటిల్యుని అర్ధశాస్త్రం, మహాభారతం లాంటి గ్రంథాలు ప్రజల హక్కులను రక్షించడానికి రాజుకి అవసరమైన అన్ని సూచనలూ చేశాయి. రాజు సంతోషం అనేది ప్రజల ఆనందంతో ముడిపడి వుంటుందని, ప్రజల హితమే రాజు హితమని కూడా వుంది. ఇదే విషయంలో విష్ణుధర్మ సూత్రంలో కూడా చెప్పబడింది.
దీనికి సంబంధించే మార్కండేయ పురాణంలో కూడా వుంది. రాజు మరుత్తుని అమ్మమ్మ ఆయనకు హితబోధ చేసింది. ‘‘రాజు శరీరం భోగలాలసతలను అనుభవించడానికి పుట్టింది కాదు. అది తన విధిని నిర్వర్తించడానికి, రాజ్యాన్ని రక్షించడానికి చేసే ప్రయత్నంలో ప్రతి కష్టాన్ని భరించడానికి తయారు చేయబడింది’’ అని సూచించింది. అలాగే మన విద్యాభ్యాసంలో కూడా లేని ఫీజుల్లేని విధానమే వుంది. ఇందుకు తార్కాణాల్లోని ఒకటి బృహదారణ్యకోపనిషత్తు. ఇందులో జనకుడు యాజ్ఞవల్క్యుడికి గురుదక్షిణ ఇచ్చినప్పుడు, యాజ్ఞవల్క్యుడు చెప్పినట్లుగా, శిష్యుడికి పూర్తిగా బోధించకుండా ప్రతిఫలం తీసుకోకూడదని తన తండ్రి చెప్పారని పేర్కొన్నాడు. శిష్యుడు తన సామర్థ్యానికి అనుగుణంగా గురువుకు దక్షిణ ఇవ్వాలని ఆపస్తంభ ధర్మ సూత్రంలో వుంటుంది.
అలాగే స్త్రీల హక్కులకు సంబంధించి చూస్తే.. వారికి విద్యాహక్కు వుండేది. ప్రస్తుత, మధ్య యుగాల్లో కంటే పురాతన కాలంలోనే స్త్రీ విద్యా విధానం అద్భుతంగా వుండేది. ఋగ్వేదంలోని 2/28 భాగాలను అత్రికులానికి చెందిన విశ్వారా రచించినట్లుగా స్త్రీలు కూడా కొన్నింటిని రాశారు. అదే వంశానికి చెందిన అపలా ఋగ్వేదంలో 8/91 భాగాలను రచించాడు. ఋగ్వేదంలోని 10/39 భాగాలను ఘోష కక్షివతి అంటారు. ఉపనిషత్తుల్లో కూడా విదేహ రాజైన జనకుడి రాజ దర్బారులో జరిగే చర్చల్లో గార్గి పేరును కూడా తీసుకునేవారు. భారతీయ సంప్రదాయంలో మహిళలు కూడా పాఠాలు బోధించే సంప్రదాయం వుంది. ఆచార్య, ఉపాధ్యాయ వంటి పదాలను పాణిని పొందుపరిచారు.సూత్ర కాలంలో స్త్రీలు వేద మంత్రాలను పఠిస్తారు అని వుంది. ఋగ్వేద మండలంలో అదితి ఆదిత్యుల తల్లి.విశ్వవర ఘోష, అపలా, లోప ముద్ర మొదలైన తెలివైన స్త్రీలు ఆనాటి స్త్రీలకు అన్ని రంగాలలో హక్కులు ఉండేవనే విషయం మనకు తెలుస్తోంది.మానవ హక్కులకు వెన్నెముక అయిన సమానత్వం అన్న భావన ఋగ్వేదంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
‘अज्येस्थासो अकानस्थासा येते
सैम भ्रातारो वावरुधुह सौभाग्याः
– ऋग्वेद, मंडल-5, सूक्त-60, मंत्र-5
అని ఋగ్వేదంలో వుంది. అంటే.. ఎవరూ గొప్పవారు కాదు. తక్కువ వారూ కాదు. అందరూ సోదరులే.అందరూ సమష్టిగా పురోగమిస్తూ అందరి ప్రయోజనాల కోసం కృషి చేయాలి’’ అన్నది అర్థం.
2. ఇక ఆహారం, నీటి హక్కుల విషయంలో, మానవ హక్కల విషయాలను అథర్వణ వేదం కూడా ప్రస్తావిస్తుంది.
समानी प्रपा सह वोऽन्नभागः समाने योक्त्रे सह वो युनज्मि।
सम्यज्ञ्चो अग्नि सपर्यतारा नाभिमिवाभितः॥
(సమానత్వాన్ని కోరుకునే ప్రజలారా… మంచినీళ్లు తాగే స్థలం , ఆహారం స్వీకరించే స్థలం కూడా ఒక్కటే వుండాలి.సామూహిక పద్ధతే వుండాలి. అందర్నీ ప్రేమ అన్న దానిలో వుంచాలి.ఓ కేంద్రం ఆధారంగా చక్రాలు ఎలాగైతే తిరుగుతాయో… అలాగే మీరందరూ ఒకే విషయంపై అగ్ని దేవుడ్ని ఉపాసించాలి.
ఇక.. అథర్వణ వేదం, సమానస్య సూక్తంలో మానవ హక్కుల గురించి వుంది. బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఆనందం పొందే హక్కు గురించి కూడా చెప్పబడింది.
सर्वे भवन्तु सुखिनः , सर्वे संतु निरामया
सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुख भाग भवेत అని వుంది. అంటే.. అందరూ సంతోషంగా వుండాలి. అందరూ ఆరోగ్యంగా వుండాలి. అందరూ బాగుండాలి. ఎవ్వరూ బాధపడొద్దు అని వుంది.
ఇక.. కౌటిల్యుని అర్ధశాస్త్రంలోనూ సంతోషం అన్న హక్కుపై వుంది.
प्रजासुखे सुखं राज्ञः प्रजानां तु हिते हितम् नात्मप्रियं हितं राज्ञः प्रजानां तु प्रियं हितम्॥
అంటే రాజు ఆనందం ప్రజల ఆనందంలో వుంది. ప్రజల సంక్షేమమే రాజు సంక్షేమం. తనంతట తాను మెచ్చుకోలు అనేది లేదు. దేనివల్లనైతే రాజ్యంలోని ప్రజలు సుఖ సంతోషాలతో వుంటారో.. అప్పుడే రాజుకి మెచ్చుకోలు. నారద పురాణంలోనూ వుంది. ఇలా భారతీయ పురాణాల్లో, వేదాల్లో హక్కులు, ఆనందం గురించి స్పష్టంగా చెప్పబడింది.
పురాతన కాలం నుంచి కూడా భారత దేశం ధర్మం, సంస్కృతి ప్రధాన దేశమే. రాజకీయమైనా, సామాజిక కార్యకలాపాలు అయినా ధర్మం, సంస్కృతి నుంచి వేరుగా లేవు. దాంట్లో ఇమిడే ఇవన్నీ నడిచాయి. భారతీయ దృక్పథం విశాలమైన అంతర్జాతీయ మానవ హక్కుల సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడంలో, సుసంపన్నం చేయడంంలో ఎంతో ఉపయోగకారిగా వుంది. మనం ప్రాచీన కాలం నుంచే హక్కులు, ఆనందం ఇవన్నీ ప్రస్తావిస్తూ.. ప్రజలకు అందుబాటులో వుంచాం. అయితే నేటికీ పాశ్చాత్య రాజ్యాల్లో చాలా వరకూ ప్రాథమిక విధుల ప్రస్తావనే లేదు. అయితే ప్రాథమిక హక్కులు పుష్కలంగా వున్నాయి. అయితే విధులు, హక్కుల మధ్య అసమతౌల్యత కారణంగా అనేక సమస్యలు వచ్చిపడ్డాయి. కానీ భారత దేశంలో ఎప్పటి నుంచో వున్నాయి. వ్యక్తి గౌరవం, హక్కులు భారతీయ సంస్కృతి, భారతీయ సమాజం ప్రాథమిక లక్షణాలు. ఈ కారణంగానే భారతీయ సంస్కృతి వేల సంవత్సరాలుగా ఉనికిలో వుంది.
(నేడు మానవ హక్కుల దినోత్సవం…) 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *