పర్యావరణ హిత జీవన శైలి కోసం ideas4life
పర్యావరణ అనుకూల జీవన శైలికి సంబంధించిన ప్రవర్తనా మార్పులను ప్రేరేపించే ఉత్పత్తులు, సేవలకు సంబంధించి ఆలోచనలను ఆహ్వానించడానికి ఐడియాస్4 లైఫఖ (ideas4life) పోర్టల్ ప్రారంభమైంది. అంతర్జాతీయ కార్యక్రమమైన మిషన్ లైఫ్ కి దోహదపడేలా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకుల్లో సృజనాత్మక ఆలోచనను ప్రోత్సహించడం, ప్రేరేపించడం దీని లక్ష్యం. భాగస్వాములు తమ భావాలు, ఆవిష్కరణలను ఆన్ లైన్ లో సమర్పించే అవకాశాన్ని ideas4life.nic.in పోర్టల్ అందిస్తుంది. మిషన్ లైఫ్ పరిధిలోని ఏడు విభాగాల్లో విజేతలు, సంస్థలకు ఆకర్షణీయమైన బహుమతులు కూడా ప్రదానం చేస్తారు. విద్యార్థులు, పరిశోధకులు, విద్యా సిబ్బందిలో ఐడియా 4లైఫ్ భావ వ్యాప్తిని విస్తృతం చేయడంలో, పర్యావరణ అనుకూల జీవనశైలిని అవలంబించడానికి కావాల్సిన సృజనాత్మక పౌర కేంద్రీకృత భావనలు, సాంకేతికతలను రూపొందించడంలో యూజీసీ, ఏఐసీటీఈ దేశవ్యాప్తంగా వున్న ఐఐటీలు, విద్యా సంస్థలు పాత్ర పోషిస్తాయి. మిషన్ లైఫ్ అమలులో యూనిసెఫ్ క్రియాశీల భాగస్వామిగా వుంది. వినూత్న ఆలోచనల సమర్పణ, నిర్వహణ, వివిధ అంశాల తదుపరి ప్రక్రియ కోసం యునిసెఫ్ యువ సహకాంతో ఈ పోర్టల్ రూపొందింది.