ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ రికార్డ్… భగవద్గీతను పూర్తి స్థాయి కోర్స్ గా ప్రవేశపెట్టిన అధికారులు
ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి ఈ యూనివర్సిటీ భగవతన గీతా కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సు ఈ మాసం నుంచే ఓడీఎలన మోడలనలో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కోర్సు చేయాలనుకునే వారు 12,600 రూపాయలు చెల్లించాల్సి వుంటుంది.ప్రపంచంలోని ఏ యూనివర్సిటీలోనూ శ్రీమద్భగవద్గీత ఎం.ఏ. కోర్సు లేదు. అమెరికాలోని హిందూ యూనివర్సిటీల్లోనూ డిప్లోమా లేదా సర్టిఫికేటన కోర్సులు మాత్రమే నిర్వహిస్తారు. అలాగే వివిధ విశ్వవిద్యాలయాలలో గీతా పాఠ్యాంశాలు పాక్షికంగానే చేర్చారు. ఇలా పాక్షికంగానో… డిప్లోమా రూపంలోనో వున్నాయి. కానీ డిగ్రీ స్థాయిలో ఓ కోర్సును ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం.
ఈ కోర్సు పూర్తి పేరు ఎం.ఏ. భగవద్గీత స్టడీస్. అనేక విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ప్రొఫెసర్ల మార్గదర్శకత్వంలో ఈ కోర్సును అభివృద్ది చేశారు. అలాగే ప్రొఫేసర్ దేవేంద్ర మిశ్రా కోఆర్డినేటర్ గా వుంటూ… ఈ పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతానికి ఈ కోర్సు కేవలం హిందీ మాధ్యమంలోనే వుంది. కొన్ని రోజుల తర్వాత విదేశాల్లోనూ ఈ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రొఫెసరన దేవేంద్ర మిశ్రా గత మూడు సంవత్సరాలలో ఎంఏ జ్యోతిషం, ఎంఏ వేద అధ్యయనాలు, ఎం.ఏ హిందూ అధ్యయనాలు, వాస్తు శాస్త్రంలో పీజీ డిప్లోమా…. లాంటి వాటిలో సర్టిఫికేట్ ప్రోగ్రామ్ వంటి కోర్సులను నిర్వహించిన అనుభవం వుంది. అందుకే ఈ భగవద్గీత కోర్సుకు కూడా ఈయనే కోఆర్డినేటర్.