రామ్ లల్లా ప్రతిష్ఠతో… అయోధ్య రూపురేఖలే మారిపోయాయి… IIM లక్నో నివేదిక ఇదీ…

అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత అక్కడి రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. అయోధ్య నగర చరిత్రనే రామ మందిర ప్రతిష్ఠ మార్చేసింది. రామ మందిర నిర్మాణం తర్వాత అయోధ్య ఆర్థిక వ్యవస్థ విపరీతమైన అభివృద్ధిలో వుంది. ఈ విషయాన్ని IIM లక్నో విడుదల చేసిన ‘‘అయోధ్య ఆర్థిక పునరుజ్జీవనం’’ అనే రిపోర్టులో వుంది.

అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాత విస్తృతమైన ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని ఆ రిపోర్టులో వుంది. అలాగే ఉపాధి కల్పన కూడా విపరీతంగా పెరిగిందని తెలిపారు. మతపరమైన మౌలిక సదుపాయాలు, పరిపాలనా నిబద్ధత అనేది ఆర్థిక వ్యవస్థకు ఉత్ప్రేకరకంగా మారిందని పేర్కొన్నారు.

IIM లక్నో అధ్యయనం ప్రకారం ఆలయ నిర్మాణానికి ముందు అయోధ్య అంటే తీర్థయాత్రా స్థలంగానే గుర్తింపు వుండేది. సందర్శకుల సంఖ్య దాదాపుగా 1.7 లక్షలుగా వుండేది. స్థానికంగా వుండే మార్కెట్లు, దుకాణాల ఆదాయం కూడా రోజుకి 400 రూపాయల నుంచి 500 రూపాయల ఆదాయం మాత్రమే వుండేది. దీంతో ఆర్థిక కార్యకలాపాల పరిధి కూడా అంతంత మాత్రంగానే వుండేది.

అలాగే దేవాలయ నిర్మాణానికి పూర్వం జాతీయ స్థాయి హోటళ్లు కూడా తక్కువగానే వుండేది. ఇక ప్రయాణ సౌకర్యాలు కూడా అంతంతమాత్రమే. రైల్వే స్టేషన్ లో కేవలం మౌలిక సదుపాయాలు కూడా పరిమితం. విమానాశ్రయం ఊసే లేదు. దీంతో అయోధ్య కనెక్టివిటీ చాలా పరిమితంగానే వుండేది.

అంతేకాకుండా అక్కడ సరైన ఉపాధి దొరక్కపోవడంతో కూలీలు దగ్గర్లో వున్న ఇతర పట్టణాలకు వలస వెళ్లేవారు. ఇది నిత్యకృత్యమైంది. పర్యాటకం ద్వారా వచ్చే ఆర్థిక ఆదాయాలు రాష్ట్ర విస్తృత అభివృద్ధికి దోహదపడేది కాదు. రియల్ ఎస్టేట్ కూడా స్తబ్దుగా వుండేది. ఒక్క మాటలో చెప్పాలంటే మందిర నిర్మాణానికి పూర్వం అయోధ్య అనేది సంప్రదాయ తీర్థస్థలంగానే వుండేది. మందిర నిర్మాణం తర్వాత అక్కడి రూపు రేఖలే మారిపోయాయి.

మందిర నిర్మాణం తర్వాత పరిస్థితులే మారిపోయాయి…

IIM లక్నో అధ్యయనం ప్రకారం అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్ఠాపన తర్వాత అయోధ్య ఆర్థిక పరిస్థితులే మారిపోయాయి. మొదటి ఆరు నెలల్లోనే 110 మిలియన్లకు పైగా భక్తులు వచ్చారు. దీంతో స్థానికంగా వున్న మార్కెట్, రవాణా, ఆతిథ్య రంగాలకు కొత్త జవసత్వాలు వచ్చాయి. ఇప్పుడు అయోధ్య 50 నుంచి 60 మిలియన్ల మంది సందర్శకులు వస్తున్నారు. అంతేకాకుండా దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక గమ్యస్థానాలలో ఒకటిగా నిలిచింది. సుమారు 85 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో వున్నాయి. దీని ప్రభావం మౌలిక సదుపాయాలకే కాకుండా, పెట్టుబడి, సేవా రంగాలకు కూడా విస్తరించింది.

అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం, ఆధునిక హంగులతో రైల్వే స్టేషన్, విస్తరించిన రోడ్లు, నగర సుందరీకరణ… ఇలాంటి ప్రాజెక్టులతో విస్తృతంగా అభివృద్ధి పుంతలు తొక్కుతోంది. అలాగే ఎలక్ట్రిసిటీ వాహనాలు, సౌరశక్తి వంటిని కూడా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఓ రకంగా అయోధ్య ‘‘మోడల్ సోలార్ సిటీ’’ గా అభివృద్ధి చెందుతోంది.

2025 నాటికే యూపీలో పర్యాటక వ్యయం 4 లక్షల కోట్లు దాటిందని అంచనా. ఇందులో అయోధ్య నగరమే ప్రముఖ పాత్ర పోషిస్తోంది. పర్యాటక ఆధారిత కార్యకలాపాల నుంచి ఆదాయం 20 వేల నుంచి 25 కోట్లకు చేరిందని అంచనా. అలాగే నిర్మాణ రంగం, రవాణా రంగం, ఆతిథ్య రంగం, సేవా రంగాలల్లో ఉపాధి అవకాశాలు కూడా పుష్కలంగా పెరిగాయి.అలాగే, అయోధ్య జాతీయ మరియు అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా కొత్త గుర్తింపు పొందింది, NRIలు, పరిశోధకులు మరియు ప్రపంచంలో వున్న వారందర్నీ ఆకర్షిస్తోంది.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ప్రకారం, ఆలయ ప్రతిష్ఠ తర్వాత లక్ష కోట్లకు పైగా దేశ వ్యాప్తంగా వ్యాపారం అయ్యితే,. అందులో అయోధ్యదే అధిక భాగం. రోజువారీగా రెండు లక్షలకు పైగా భక్తులు రావడంతో ఆతిధ్య రంగం లాంటి పరిశ్రమలు ఊపందుకున్నాయి. ప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో సుమారు 150 కి పైగా కొత్త హోటళ్లు, హోమ్ స్టేలు స్థాపించారు. తాజ్ హోటల్స్ తో పాటు వివిధ రకాల ఇంటర్నేషనల్ హోటల్స్, రిసార్టులు కూడా తాము అయోధ్యలో విస్తరిస్తామని ప్రకటించాయి. ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లలో అయోధ్య బుకింగ్‌లు నాలుగు రెట్లు పెరిగాయి. స్థానిక హస్తకళలు, మతపరమైన సావనీర్లు మరియు విగ్రహాలకు డిమాండ్ కూడా పెరిగింది, ఇది చేతివృత్తులవారికి మరియు స్థానిక ఉత్పత్తిదారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది.

IIM లక్నో నివేదిక ప్రకారం ఆర్థిక క్రియాశీలతో, వ్యవస్థాపరంగా, ఉద్యోగాల కల్పనలో కూడా విపరీతమైన వృద్ధి కనిపిస్తోంది. ముఖ్యంగా యువతలో దాదాపు 6 వేలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు స్థాపించబడ్డాయి. అందులో కొన్ని అయోధ్య ప్రతిష్ఠాపన తర్వాత తిరిగి చేరుకున్నాయి కూడా.పర్యాటక వృద్ధి వల్ల రాబోయే 4–5 సంవత్సరాలలో పర్యాటకం, రవాణా మరియు ఆతిథ్య రంగాలలో దాదాపు 1.2 లక్షల ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. చిన్న దుకాణదారులు మరియు వీధి వ్యాపారుల రోజువారీ ఆదాయం ₹2,500 కు చేరుకుంది. రియల్ ఎస్టేట్ రంగం కూడా వేగంగా వృద్ధి చెందింది, ఆలయం చుట్టూ ఉన్న ఆస్తి విలువలు ఐదు నుండి పది రెట్లు పెరిగాయి, దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించాయి.

అయోధ్య అభివృద్ధి ఇకపై కేవలం మతపరమైన ప్రాముఖ్యతకే పరిమితం కాలేదు, అది ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాలకు శక్తివంతమైన కేంద్రంగా అవతరించిందని నివేదిక స్పష్టంగా చెబుతోంది. సంప్రదాయ ధార్మికతను ఆధారంగా చేసుకొని అభివృద్ధి నమూనాలను తయారు చేస్తే, కచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని అయోధ్య నిరూపించింది. ప్రణాళికాబద్ధమైన పెట్టుబడి, పరిపాలనా సమన్వయం మరియు దీర్ఘకాలిక దృష్టితో అమలు చేస్తే, స్థానిక ఆర్థిక వ్యవస్థలో సమగ్రమైన మరియు నిర్మాణాత్మక మార్పులను తీసుకురాగలవని కూడా సూచించింది. అలాగే ప్రణాళికాబద్ధంగా సాంస్కృతిక, ధార్మికమైన ప్రాజెక్టుల ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం బహుముఖ ఆర్థిక వృద్ధికి కూడా కారణం అవ్వగలదని అయోధ్య నిరూపించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *