ఊరూరా చిరు ధాన్యాలు పండించాలి : ఐఐఎంఆర్ డైరెక్టర్ పిలుపు
ప్రతి ఒక్కరూ చిరు ధాన్యాలను ప్రాథమిక అవసరంగా గుర్తించాలని ఐఐఎంఆర్ (చిరుధాన్యాల పరిశోధన సంస్థ) డైరెక్టర్ తారాసత్యవతి సూచించారు. ఊరూరా చిరు ధాన్యాలు సాగు కావాలని, పెద్ద మొత్తంలో సాగు కావాలని, ఇంటింటికీ వాటి ఆహారం చేరాలన్నారు. ఐఐఎంఆర్ పదో వార్షికోత్సం సందర్భంగా ఆమె రాజేంద్ర నగర్ లోని సంస్థ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… చిరు ధాన్యాలకు పూర్వ వైభవం తెచ్చే సత్తా రైతులకు మాత్రమే వుందని, వాటి సాగు విరివిగా చేయాలన్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీ ప్రోత్సాహం ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ విషయంలో తమ సంస్థ అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తోందన్నారు. సాగు విస్తరణతో పాటు వినియోగం, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. వచ్చే నెల 2,3 తేదీల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు మరో ఐదు రాష్ట్రాల రైతులతో కిసాన్ మేళా నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఆయా రాష్ట్రాల్లో చిరు ధాన్యాల సాగు ప్రణాళికలను ప్రకటిస్తామన్నారు.