హిందుత్వం ఓ వ్యాధి : ఇల్తిజా ముఫ్తీ

హిందుత్వ విషయంలో జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ అవమానించేరకంగా వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మం అనేది ఓ వ్యాధి అని, ఇది భారత్ లోని కొన్ని కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ రకంగా ఆమె ఇస్లాంను సమర్థించినట్లే. జైశ్రీరామ్ అన్న నినాదాన్ని మూకదాడులతో ముడిపెడుతూ ఆమె ట్వీట్ చేశారు. హిందూ ధర్మాన్ని వ్యాధితో పోల్చడంపై జాతీయవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. వెంటనే ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
‘‘హిందుత్వ ఓ రోగం. దీనిని నయం చేయాలంటూ వ్యాఖ్యానించింది.హిందుత్వకు, హిందూయిజానికి చాలా తేడా వుందని, హిందువుల ఆధిపత్యం కోసం 1940 లో వీర సావర్కర్ దీనిని వ్యాప్తి చేశారంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. ఇండియా అంటే హిందువులదని, హిందువుల కోసమేనని ఆ సిద్ధాంతం చెబుతోందని పేర్కొన్నారు. అలాగే ఇస్లాం లాగే హిందూయిజం కూడా లౌకికవాదం, ప్రేమను ప్రోత్సహించే మతమని, దీన్ని వక్రీకరిస్తున్నారంటూ దురుద్దేశాన్ని ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేశారు. హిందూయిజానికి వక్రభాష్యం చెబుతున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *