స్వాతంత్య్రాన్ని రక్షించుకోవాలి
భారతదేశం స్వాతంత్య్రాన్ని కోల్పోవడానికి కారణం స్వదేశస్థులు చేసిన ద్రోహమే అని చెప్పాలి. సింధు ప్రాంతపు రాజా దాహీర్‌ను మహమ్మద్ బిన్ ఖాసిం ఓడిరచాడు. ఈ ఓటమికి ఏకైక కారణం సింధు సేనాపతులు ఖాసిం మనుషుల దగ్గర లంచాలు తీసుకొని తమ రాజు తరఫున పోరాడక పోవటమే. పృథ్వీరాజుతో పోరాడటానికి రమ్మని మహమ్మద్ ఘోరీని ఆహ్వానించినవాడు భారతదేశానికి చెందిన రాజా జయ చంద్రుడే. హిందువుల స్వాతంత్య్రం కోసం శివాజీ పోరాడుతున్న రోజుల్లో ఇతర మరాఠా నాయకులు, రాజపుత్రులు మొఘలు చక్రవర్తి తరఫున పోరాడారు. బ్రిటిషువారికి వ్యతిరేకంగా శిక్కులు పోరాడుతున్నపుడు ఆ శిక్కుల నాయకుడు చేసింది ఏమీలేదు.అటువంటి దురదృష్ట సంఘటలు మళ్లీ ఎన్నడూ జరుగకూడదు.
– డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్