మేమున్నా లేకున్నా భారత్‌ ముందుకే సాగాలి

సాధరణంగా కొందరు మనుషులకు కొన్ని సందర్భాల్లో అనేక కష్టాలను ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతాయి. భూపాల్‌లోని అరోరా కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న కల్పన విశ్వకర్మ కథ కూడా ఇలాగే అనిపిస్తుంది. ఒక కాలు గ్యాంగ్రీన్‌ కారణంగా చెడిపోయింది. వికలాంగు రాలైన కల్పనకు కరోనా అనేక కష్టాలను తెచ్చి పెట్టింది. ఆమె గర్భవతి అయింది. ఆమె మామయ్య ద్వారకా ప్రసాద్‌ విశ్వకర్మ కరోనా వైరస్‌ సోకి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. మరోవైపు లాక్‌ డౌన్‌ వల్ల భర్త ఆటోకి గిరాకీ లేకుండా పోయింది. కడుపులో చిన్న పాప, మరో వైపు మామ కరోనా ఖర్చును భరించడం కష్టమయ్యింది. ఆమె కూడా తిండి గింజలకు తపించవలసి వచ్చింది. ఈ గడ్డు పరిస్థితి భూపాల్‌కి చెందిన సేవా భారతి మహానగర మహిళా సంయోజిక ఆభా దీదీకి తెలిసి కల్పనకు అండగా నిలబడడంతో ఆమెకు బ్రతుకుపై ఆశ వచ్చింది. సేవా భారతి కార్యకర్తలు కల్పన కుటుంబ బాధ్యతలు తమ భుజలపై వేసుకున్నారు.

ముందుగా వారు కల్పన మామగారి చికిత్సను చేపట్టారు. కానీ అప్పటికే సమయం మించి ఆయన చనిపోయారు. అతని అంతిమ సంస్కారాల నుండి 13వ రోజు వరకు అన్ని కర్మలు సేవా భారతి వారే పూర్తి చేశారు. అంతేకాదు లాక్‌ డౌన్‌ పూర్తయ్యేవరకు అన్ని నిత్యావసరాలను ఆమెకు ఇచ్చారు. గర్భవతి కల్పనకు తగిన పోషకాహారం కూడా సరఫరా చేశారు.

ఇలాంటి దారుణ వ్యధలలో ఒకటి జ్యోతి కథ. ఆమె 8 ఏళ్ళ కూతురు కేన్సర్‌ తో బాధ పడుతోంది. ఇండోర్‌ నగరంలోని బాధ్‌ కాలనీలో వుండే చాలా ఇండ్లలో పాచిపని చేసి ఇల్లు నడిపేది. ఆమె భర్త సైకిల్‌ రిక్షా నడిపే వాడు. లాక్‌ డౌన్‌ వారిరువురి పనిని లాగేసింది. క్యాన్సర్‌తో బాధపడే పిల్లకు వైద్యం అటు ఉంచి అన్నం పెట్టలేని స్థితికి చేరుకుంది జ్యోతి. ఈ సమయంలో ఇండోర్‌ సేవా భారతి హెల్ప్‌లైన్‌ ద్వారా ప్రాంత సేవా భారతి సమయోజిక్‌ సునీత దీదీ ని సహాయం అర్దించింది. ఆమె పూర్తి బాధ్యత లు సేవాభారతి వాళ్ళు తీసుకొని సహాయం చేశారు. లాక్‌ డౌన్‌ సమయంలో నిత్యావసర సరుకులతో పాటు అవసరమైన అన్ని సహాయాలు చేశారు.

‘‘నేను ఉన్నా లేకున్నా భారతదేశం నిరంతరం కొనసాగాలి’’ అని మణికర్ణిక అనే సినిమాలో రాసిన ప్రసిద్ధ గేయం ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంసేవకుల కోసమే రాశారేమో అనిపిస్తుంది. సిద్ధి జిల్లాకి చెందిన సేవా ప్రముఖ్‌ ఆశీష్‌ కథ చదివితే ఈ భావన మనకు కండ్లకు కనబడుతుంది. కరోనా కాలంలో నిరంతరం సేవా కార్యక్రమాల్లో మునిగి తేలిన ఆశిష్‌ కరోనా పాజిటివ్‌ అయ్యారు. ఆయన రేవాలోని కుశ భాహు ఠాక్రే ఆసుపత్రిలో ఐసీయూలో చేరి మృత్యువుకు, జీవితానికి మధ్య ఊగిసలాడసాగారు. మహిళా వార్డులో ఒక రోగి అత్యంత దయనీయ స్థితిలో ఆక్సిజన్‌ కోసం ఎదురు చూస్తున్నదని ఆశిష్‌ గారికి నర్స్‌ మాటల్లో తెలిసింది. వెంటనే ఆయన తన సిలిండర్‌ని ఆమెకి పంపి తన ప్రాణాలని ప్రమాదంలో పడవేశారు. కర్పూరంతో ఆయన శ్వాసను పీలుస్తూ మూడు గంటలు గడిపారు. ఆ మహిళ కోలుకున్నాక తిరిగి ఆక్సిజన్‌ సిలిండర్‌ ఆశిష్‌ గారికి అమర్చారు. నేడు ఆయనతోపాటు ఆ మహిళ కూడా సంతోషంగా బతికి ఉన్నారు.

మధ్య క్షేత్రం క్షేత్ర కార్యవాహ అశోక్‌ అగర్వాల్‌ జీ మాటల్లో చెప్పాలి అంటే ‘‘సంపూర్ణ క్షేత్రంలో స్వయం సేవకులు ప్రతి అవసరాలకు సమాజానికి అండగా నిలిచారు. 589 హెల్ప్‌లైన్‌ సెంటర్‌లు, 123 ఐసోలేషన్‌ కేంద్రాలు, 17 కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లతో పాటు 649 స్థానాల్లో 40,624 భోజన ప్యాకెట్లు వితరణ చేసే పనిలో 11,077 మంది కార్యకర్తలు త్రికరణ శుద్ధిగా పని చేసారు’’.

రత్లాం దగ్గరి పంచడ్‌ గ్రామంలో 100 శాతం టీకాలు వేయించి సంఘ స్వయంసేవకులు చరిత్ర సృష్టించారు. కరోనా ప్రారంభం అయింది. 30 మంది గ్రామస్తులు చనిపోయారు. శాఖ స్వయం సేవకులు అప్రమత్తమై తమ గ్రామాని కరోనా నుండి సురక్షితంగా ఉంచేందుకు సంపూర్ణంగా పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ భూనారు. ముందుగా గ్రామానికి ప్రజల రాకపోకలను నియంత్రించారు. ఫలితంగా కరోనా ఆగిపోయింది. తరువాత ఊరిలో టీకాలు వేసే అర్హులైన వారందర్ని చైతన్య పరచి తక్కువ సమయంలో వ్యాక్సిన్‌లు ఇప్పించారు.

కరోనా రెండో వేవ్‌ వ్యాప్తి ధట్టమైన ఆడవుల్లో కూడా కనిపించింది. మధ్యప్రదేశ్‌ ఖాండవ్‌ జిల్లాలో కరోనాను ఆపడానికి ఒక కొత్త సఫల ప్రయోగం చేయబడ్డది. ఖాండవ్‌ విభాగం సేవా ప్రముఖ్‌ అతుల్‌ షా చెప్పిన విశేషాలు, వనవాసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వారు ఆసుపత్రికి రావడానికి సిద్ధంగా లేరు.

కరోనా పరీక్షలు చేయించడానికి సిద్ధంగా లేరు. జలుబు, దగ్గు, జ్వరంలతో చావుల సంఖ్య నిరంతరం పెరగడం మొదలయింది. ఇండోర్‌కి చెందిన ప్రసిద్ధ గోకుల్‌ దాస్‌ హాస్పిటల్‌, సీనియర్‌ డాక్టర్లు, వనవాసులు ప్రాతంలో పని చేసే స్థానిక డాక్టర్‌లకు కరోనా పరీక్షలు చేసే ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ ఇచ్చారు. సేవాభారతి వారు టెస్ట్‌ కిట్లు, కరోనా మందులు ఇచ్చారు. స్వయంసేవకులు, చివరి రోగి వరకు చేరేలా కృషి చేసారు. ఈ గ్రామీణ డాక్టర్ల ద్వార గుడి, సింగోట, బూరగావ్‌, గులాయిమాల్‌, రోషిణి, పటజాన్‌, జింజిరి, గోల్‌ ఖేడా, జుమ్మర్‌ఖలీ, చుట్టు ప్రక్కల గ్రామంలో 14 ూూణలు నిరంతరం వనవాసి ప్రాంతాలలో పరీక్షలు, ప్రథమ చికిత్సలు చేసి వేలమంది వనవాసిలను రక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *