సౌర విద్యుత్ ఉత్పత్తిలో మూడో స్థానంలో భారత్.. వెనక్కి వెళ్ళిన జపాన్
సౌరశక్తి వినియోగంలో భారత్ కీలక ప్రగతి సాధించింది. సౌరశక్తి ఉత్పాదనలో జపాన్‌ను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సౌర ఉత్పాదక దేశంగా భారత్ 2023 లో అవతరించింది. గ్లోబల్ ఎనర్జీ సెక్టార్‌లో పనిచేస్తున్న పరిశోధనా సంస్థ ఎంబర్ ఈ విషయాన్ని వెల్లడిరచింది. అయితే… 2015 లో సౌరశక్తి విస్తరణలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. కానీ… కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సౌర విద్యుత్‌కి అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా జపాన్‌ను తలదన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సౌర ఉత్పాదక దేశంగా నిలిచింది. గతంలో 5.5 శాతంగా సౌర ఉత్పాదకత వుండగా… ఇప్పుడు 5.8 శాతంగా వుంది. మొదటి స్థానంలో అమెరికా, రెండో స్థానంలో బ్రెజిల్ వుండగా… మూడో స్థానం మనదే. చైనా సహా ప్రపంచంలోని పలు దేశల్లో జల విద్యుదుత్పత్తి ఐదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని, లేదంటే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ఇంకా పెరిగేదని రిపోర్టు పేర్కొంది. ఎంబర్ ఆసియా ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆదిత్య మాట్లాడుతూ… ఇలా సౌర విద్యుత్‌ను పెంచడమంటే కేవలం కర్బన ఉద్గారాలను తగ్గించడం మాత్రమే కాదని, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను తీర్చడానికి, ఉద్గారాల నుంచి ఆర్థిక వృద్ధిని తగ్గించడానికి కూడా ఇది అవసరమేనని, అలాగే వాతావరణంలో వస్తున్న మార్పులను కూడా దృష్టిలో పెట్టుకున్నామని వివరించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన అన్న పతాకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి దేశ వ్యాప్తంగా విశేష స్పందన వస్తోంది. దేశ వ్యాప్తంగా చాల మంది దీనికి ఆకర్షితులై, అప్ప్లయ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు కోటి మంది అప్ప్లయ్ చేసుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దీనిపై హర్షం వ్యక్తం చేసారు. ముఖ్యంగా అస్సాం, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిస్స, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగాయని మోడీ ప్రకటించారు. ఈ పథకం కింద ఇంకా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. ఉచిత విద్యత్ పథకం మరింత మంది రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని, పర్యావరణానికి మెరుగైన సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. అలాగే గృహాలకు విద్యుత్ ఖర్చును కూడా తగ్గిస్తుందని అన్నారు.