పాకిస్తానీ హిందువులకు భారత పౌరసత్వం

పాకిస్తాన్‌ ‌నుండి వచ్చి దశాబ్దాలుగా మధ్య ప్రదేశ్‌లో నివసిస్తున్నఆరుగురు హిందువులకు పౌరసత్వ సవరణ చట్టం(సి ఏ ఏ) కింద భారత పౌరసత్వం లభించింది. గతంలో మతపరమైన హింస కారణంగా వారు ఆరుగురూ పాకిస్తాన్‌ ‌నుండి భారత్‌కు వచ్చారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సి.ఎ.ఎ) ద్వారా వారు ప్రస్తుతం భారత పౌరసత్వాన్ని పొందారు.

వీరు 1988 నుంచి 2005 వరకు భారతదేశానికి వలస వచ్చినట్టు రాష్ట్ర అధికారులు వెల్లడించారు.

పొరుగు దేశాల్లో మతపరమైన హింస కారణంగా భారత్‌కు వచ్చిన ఈ హిందూ వలస దారులకు సి.ఏ.ఏ చట్టం కింద వారికి భారత పౌరసత్వం అందించబడిందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ పక్రియను పూర్తి చేసి వారికి భారత పౌరసత్వ ధృవీకరణ పత్రాలను అందజేశామని మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. భారతీయ పౌరసత్వం పొందిన వారిలో భోపాల్‌కు చెందిన నందలాల్‌, అమిత్‌, ‌మాండ్‌ ‌సౌర్‌కు చెందిన అర్జుందస్‌ ‌మంచందాని, జైరామ్‌ ‌దాస్‌, ‌నారాయణ దాస్‌ ‌సౌశల్య బాయి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *