నౌకాదళంలో సరికొత్త చరిత్ర.. మొదటి సారిగా మహిళా పైలట్‌కి ”గోల్డెన్ వింగ్స్”
భారత నౌకాదళంలో సరికొత్త చరిత్రకి తెరలేపింది. నౌకాదళంలో పనిచేస్తున్న మహిళా పైలట్‌కి తొలిసారిగా గోల్డెన్ వింగ్స్ పతకం మొదటి సారిగా లభించింది. హెలికాప్టర్ పైలట్‌గా శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన సబ్ లెఫ్టినెంట్ అనామిక బీ రాజీవ్‌కు ఈ గౌరవం దక్కింది. తమిళనాడులోని అరక్కోణంలో వున్న నేవల్ యిర్ బేస్ స్టేషన్‌లో జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్‌లో ఈస్ట్రన్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, కమాండిరగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్‌కర్ దీనిని అందజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న మరో 21 మందికి కూడా అవార్డులు దక్కాయి. ఈ పైలట్ శిక్షణ 22 వారాల పాటు కొనసాగింది.