ప్లాస్టిక్ వేస్ట్ అక్కడ ఫీజు … డబ్బులు ఉండవ్… ఎంత ఎక్కువ ప్లాస్టిక్ తెస్తే అంత మంచి విద్యార్ధి

ఏ పాఠశాలలో అయినా లక్షలకి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తారు. డబ్బులు కడితేనే విద్యను బోధిస్తారు. కానీ… కొందరు పర్యావరణ ప్రేమికులు మాత్రం అత్యంత వినూత్నంగా ఆలోచించి, భూమాత విషయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తున్నారు. అసోంలోని అక్షర అనే పాఠశాలను పర్మితా శర్మ, మజిన్‌ ముక్తార్‌ అనే పర్యావరణ ప్రేమికులు కలిసి ఈ పాఠశాలను నడుపుతున్నారు. అయితే.. అక్కడ విద్యార్థుల నుంచి ఫీజు డబ్బుల రూపంలో తీసుకోరు. ఫీజుకు బదులు ప్లాస్టిక్‌ వేస్ట్‌ను తీసుకుంటారు. అదే అక్కడి ఫీజు. 2016 లో దీనిని స్థాపించారు. పర్యావరణంపై వున్న ప్రేమతో వీరిద్దరూ ప్లాస్టిక్‌ వేస్ట్‌నే ఫీజుగా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే… చదువు, నైపుణ్యంతో పాటు పర్యావరణ స్పృహ కూడా సిలబస్‌లో కలిపారు. ప్రతి విద్యార్థికి కూడా పర్యావరణంపై కనీస అవగాహన వుంచాలని వారు నిర్ణయించారు. రానూ రానూ ప్లాస్టిక్‌ పర్యావరణానికి అత్యంత ప్రమాదకారి కాబట్టే.. ప్లాస్టిక్‌ నుంచి ప్రారంభించాలని భావించారు. అందుకే ప్లాస్టిక్‌ వ్యర్థాలు తీసుకెళ్తే… ఫీజు కట్టినట్లే రిసీప్టు ఇస్తారు. అంతేకాకుండా కేవలం పర్యావరణం గురించి మాత్రమే కాకుండా వడ్రంగి పని, తోట పని లాంటి ఆచరణాత్మక నైపుణ్యాలను కూడా నేర్పిస్తారు. అంతేకాకుండా వ్యర్థమైన ప్లాస్టిక్‌ బాటిళ్లను ఇటుకలుగా ఎలా మార్చాలో కూడా నేర్పిస్తారు. అలాగే ప్టాస్టిక్‌ ను రీసైక్లింగ్‌ ఎలా చేయడం? తిరిగి ఎలా వాడటం?లాంటివి కూడా నేర్పుతారు.

ఇలా పిల్లలకు పర్యావరణం, పర్యావరణ ఇటుకలు, ప్టాస్టిక్‌ నిషేధం, ప్లాస్టిక్‌ వాడకం వల్ల కలిగే హానితో పాటు పర్యావరణానికి దోహదపడే అంశాలను కూడా పాఠశాల యాజమాన్యం వారికి నేర్పిస్తోంది. అలాగే ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ చేసే విధానాన్ని కూడా బోధిస్తోంది. ఎంత ప్లాస్టిక్‌ వేస్టేజీ తీసుకొని వస్తే.. అంత మెచ్చుకుంటారు. ఉత్తమ విద్యార్థులుగా కూడా ప్రకటిస్తారు. ఇప్పటి వరకు దాదాపు రెండున్నర వేల ప్లాస్టిక్‌ బాటిళ్లు, 7 లక్షల ప్లాస్టిక్‌ కవర్లు రీసైకిల్‌ చేశారు.

అంతేకాకుండా విద్యార్థులతో కూడా క్లాసులు బోధన జరిగేలా చూస్తుంటారు. విద్యార్థులే అప్పుడప్పుడు అక్కడ ఉపాధ్యాయులుగా వుంటూ పర్యావరణంపై పాఠాలు, ప్రాక్టికల్‌ క్లాసులు కూడా తీసుకుంటుంటారు. నిజమైన ఉపాధ్యాయులు వీటిని బాగా ప్రేరేపిస్తారు. మరో విషయం ఏమిటంటే ఇక్కడ విద్యార్థులను వారి వయస్సును బట్టి కాకుండా అవగాహన స్థాయిని బట్టి తరగతి గదుల్లో కూర్చోబెడతారు.

నిజానికి అసోంలో బాగా చలి వుంటుంది. ఏ వస్తువు దొరికితే దానిని కాల్చి చలి కాచుకోవడం అక్కడ చేస్తుంటారు. చివరికి ప్లాస్టిక్‌ దొరికితే దానితోనైనా చలి కాచుకుంటారు. ప్లాస్టిక్‌ బాటిళ్లు, కవర్లను తెచ్చి మంటలు చేసుకుంటారు. దీంతో కాలుష్యం బాగా పెరిగిపోతోంది. అలాగే ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. దీంతో పర్మితా శర్మ ఈ ఇబ్బందిని అమెరికాలో వుండే తన మిత్రుడు మజిన్‌తో పంచుకుంది. దీంతో వారిద్దరి ఆలోచనల నుంచి పుట్టిందే ఈ అక్షర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *