ఇండోనేషియాలో చాలా పేర్లు సంస్కృతం పేర్లే : ఇండోనేషియా అధ్యక్షుడు
తన పూర్వీకుల DNA భారతీయులని తేలిందని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో నుబియాంటో ప్రకటించారు.కొన్ని వారాల క్రితం తాను డీఎన్ఏ పరీక్షలు చేయించుకున్నానని, అది భారతీయత అని చూపించిందని వెల్లడించారు. ఈసారి గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో నుబియాంటో హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండోనేషియా సంస్కృతి, భాష, జన్యు శాస్త్రంపై ప్రాచీన భారతీయ సంస్కృతి ప్రభావం వుందన్నారు.
భారత దేశ ప్రాచీన చరిత్ర, ఇండోనేషియా చరిత్ర దగ్గర దగ్గరే వుంటాయన్నారు. నాగరిక సంబంధాలు కూడా వున్నాయని, ఇరుదేశాల భాషా సంస్కృతం మూలం నుంచే వచ్చిందని వివరించారు.అలాగే ఇండోనేషియా పేర్లు కూడా సంస్కృతం నుంచే వచ్చాయని, ఇవన్నీ ప్రాచీన భారతీయతకు దగ్గరగానే వుంటుందన్నారు. ఇప్పటికీ భారతీయ సంగీతం వినిపించినప్పుడు, తాను నృత్యం చేయడం ప్రారంభిస్తానని ఇండోనేషియా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు.