అనంతమైన జ్ఞానం
ప్రాణమున్న శరీరం కేవలం కాళ్ళు, చేతులు, రక్త మాంసాలతో కూడిన సమాహారం కాదు. అనంతమైన దృష్టి, అనంతమైన జ్ఞానం, అనంతమైన శక్తి, అనంతమైన ఆనందం కల్గిన ఆత్మకు శరీరం నివాసం. ఆత్మకు సహచరు లెవ్వరూ ఉండరు. ఆత్మ ఒంటిరిగానే వస్తుంది. ఒంటరిగానే వెళ్ళిపోతుంది. అయితే తనను తాను తెలుసుకొనక పోవటం ఆత్మ తప్పిదం. ఆత్మ సర్వ స్వతంత్రమైనది. బాహ్య శత్రువులను జయించటంకంటే ఆత్మను జయించటం ముఖ్యం. ఆత్మను జయించని వ్యక్తులు బాధలు పడుతారు. ఇతరులను బాధలకు గురి చేస్తారు. దారంతో ఉన్న సూది ఎలా భద్రంగా ఉంటుందో తనను తాను తెలుసుకొన్న వ్యక్తి దుఃఖం పొందజాలరు. మానవుని సకల దుఃఖాల నుండి విముక్తి కలిగించే జ్ఞానం, దేనివల్లనైతే సత్వాన్ని తెలుసు కొంటామో, మనసుని అదుపులో పెట్టుకొంటామో, ఆత్మశుద్ధి జరుగుతుందో అదే జ్ఞానం.
– వర్ధమాన మహావీరుడు