భారత్ సరికొత్త రికార్డు… మూడు యుద్ధ నౌకలూ ”మేకిన్ ఇండియా”నే

రెండు అత్యాధునిక యుద్ధ నౌకలు భారత నావికా దళంలోకి వచ్చి చేరాయి. INS నీలగిరి,INS సూరత్, జలాంతర్గామి INS వాగ్ షీర్ ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఇలా ఒకేసారి మూడు యుద్ధ నౌకలను ప్రారంభించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. వీటి రాకతో నేవీ బలం పెరుగనుంది. ఈ యుద్ధ నౌకలు భారత సైన్యానికి మరింత శక్తినిస్తాయి. రక్షణరంగంలో మేకిన్‌ ఇండియా ఆవిష్కృతమవుతోంది. ఈ మూడు కూడా మేకిన్ ఇండియానే.

నౌకాదళ కొత్త అస్త్రాలివే…

INS సూరత్ : ప్రాజెక్టు 15 బీలో భాగంగా తయారైన స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. విశాఖపట్నానికి చెందింది. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ దీనిని రూపొందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన డిస్ట్రాయర్‌ వార్‌షిప్‌లలో ఒకటి. దీనిని 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఇందులో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ ప్యాకేజీలు, అధునాతన నెట్‌వర్క్-సెంట్రిక్ సామర్థ్యాలు ఉన్నాయి.

INS నీలగిరి : ప్రాజెక్టు 17ఏలో భాగంగా నిర్మితమైన స్టెల్త్ ఫ్రిగేట్. అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీని ఇందులో వినియోగించారు. దీనిని ఇండియన్ నేవీ వార్ షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసింది. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించింది.దీనిని శత్రువును ఏమార్చే స్టెల్త్‌ పరిజ్ఞానంతో ఇండియన్ నేవీకి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించింది. సముద్రంలో ఎక్కువసేపు ఉండటం దీని సామర్ధ్యం. అలాగే ఇందులో అధునాతన టెక్నాలజీతో రూపొందించారు. ఇది తరువాతి తరం స్వదేశీ యుద్ధనౌకలను సూచిస్తుంది.

INS వాగ్ షీర్ : స్కార్పియన్ క్లాస్ ప్రాజెక్టు 75 లో భాగంగా నిర్మించిన ఆఖరి, ఆరో జలాంతర్గామి. ఫ్రాన్స్ కి చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో దీనిని నిర్మించారు. జలాంతర్గామి నిర్మాణంలో ఫ్రాన్స్‌కు చెందిన నేవల్‌ గ్రూప్‌ భాగస్వామ్యమైంది. సముద్ర భద్రతలో ఈ యుద్ధనౌక కీలకం కానున్నది.

ప్రధాన నౌకాదళ శక్తిగా భారత్ అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ ప్రపంచదేశాలు భారత్‌ను విశ్వసనీయ, బాధ్యతాయుత భాగస్వామిగా చూస్తున్నాయని తెలిపారు. 77వ సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం ముంబయిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇలా ఒకేసారి మూడు యుద్ధ నౌకలను ప్రారంభించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. వీటి రాకతో నేవీ బలం పెరుగనుంది. ఈ యుద్ధ నౌకలు భారత సైన్యానికి మరింత శక్తినిస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణరంగంలో మేకిన్‌ ఇండియా ఆవిష్కృతమవుతోందని పేర్కొన్నారు.
ప్రపంచంలో బలమైనశక్తిగా భారత్‌ మారుతోందని వ్యాఖ్యానించారు. దేశీయ విధానంలో యుద్ధనౌకల తయారీ గర్వకారణమని చెప్పారు. “ఈ మూడు కూడా మేడిన్ ఇండియానే. వీటిలో ఒకటి డెస్ట్రాయర్, మరొకటి ఫ్రిగేట్, ఇంకోటి సబ్ మెరైన్. ఇవన్నీ కలిపి ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారి. ఇప్పుడు నౌకాదళ శక్తిపరంగా భారత్ మరింత బలోపేతమైంది. భారత్ సైనిక శక్తిని పెంచుకుంటున్నది వికాసం కోసమే. విస్తరణవాదం కోసం కాదు” అని ప్రధాని తెలిపారు.

“సురక్షితమైన, వికాసశీలమైన ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని భారత్ సదా కోరుకుంటుంది. ప్రపంచ భద్రత, ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కీలక పాత్ర పోషించనుంది. భారత నౌకాదళం ప్రపంచ దేశాలతో కలిసి సముద్ర జలాల మీదుగా ఆయుధాలు, డ్రగ్స్ రవాణా జరగకుండా, టెర్రరిజానికి ఊతం లభించకుండా అడ్డుకుంటోంది. నౌకాదళం అహర్నిశలు చేస్తున్న సేవల వల్లే భారత్‌ సురక్షిత స్థానంగా మారింది” అని ప్రధాని స్పష్టం చేశారు.
గత పదేళ్లలో దేశ సైన్యానికి 33 యుద్ధ నౌకలు, 7 జలాంతర్గాములను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ‘రక్షణ రంగంలో భారత్ ఆత్మ నిర్భరతను సాధిస్తోంది. దేశంలో జరిగిన రక్షణరంగ ఉత్పత్తుల విలువ రూ.1.25 లక్షల కోట్లు దాటింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ అడుగులు వేస్తోంది’ అని మోదీ తెలిపారు.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఐఎన్ఎస్ సూరత్‌ యుద్ధ నౌకలో ప్రాజెక్ట్ 15ఏ, ప్రాజెక్ట్ 15బీ డెస్ట్రాయర్లు ఉన్నాయని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి వెల్లడించారు. ఐఎన్ఎస్ నీల్‌గిరి యుద్ధనౌకలో ప్రాజెక్ట్ 17ఏ ఫ్రిగేట్లు ఉన్నాయని, వీటిని కలిగిన తొలి భారత యుద్దనౌక ఇదేనని చెప్పారు. ఐఎన్ఎస్ వాఘ్​షీర్ యుద్ధనౌకలో ప్రాజెక్ట్ 75 జలాంతర్గాములు (సబ్ మెరైన్లు) ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మూడు యుద్ధ నౌకల చేరికతో భారత నౌకాదళం సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందని త్రిపాఠి తెలిపారు. హిందూ మహాసముద్రంలో భారతదేశ ప్రయోజనాలను కాపాడే క్రమంలో నౌకాదళం చేపట్టే ఆపరేషన్లకు ఈ యుద్ధ నౌకలు దోహదం చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *