భారత్ తొలి దేశీయ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్
భారతదేశం పూర్తిగా దేశీయంగా తయారు చేసిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ ప్రారంభోత్సవం విజయవంతంగా పూర్తయింది. దీనితో భారతదేశం ఇప్పుడు సొంత విమానవాహక నౌకలు కలిగిన దేశాల జాబితాలో చేరింది. ‘అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి మరో అడుగు’ వేసింది.
ఐఎన్‌ఎస్ విక్రాంత్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు
- భారత్ ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద నౌక కూడా ఇదే కావడం విశేషం. ఈ నౌక నిర్మాణానికి సుమారు రూ.20,000, కోట్లను భారత ప్రభుత్వం ఖర్చు పెట్టింది.
- ఇది ఎప్పుడో దేశీయంగా రూపొందించిన నిర్మించబడిన విమాన వాహక నౌక
- 1961 నుండి 1997 వరకు సేవలో ఉన్న భారతదేశ మొదటి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ పేరు పెట్టారు. ఇది 1971 పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించింది.
- ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో 2,300 కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి. 2,000 మందికి పైగా సీఎస్‌ఎల్ సిబ్బందికి, అనుబంధ పరిశ్రమలలో 12,000 మంది ఉద్యోగులకు ఉపాధి అవకాశాలను అందిస్తోంది. మహిళా అధికారులు, నావికులకు వసతి కల్పించేందుకు ప్రత్యేక క్యాబిన్‌లు కూడా ఇందులో ఉన్నాయి.
- ఇది 262 మీటర్ల పొడవు, విశాలమైన భాగం వద్ద 62 మీటర్లు, సూపర్ స్ట్రక్చర్‌ను మైనస్ 30 మీటర్ల లోతు కలిగి ఉంది. సూపర్ స్ట్రక్చర్‌లో 5తో సహా మొత్తం 14 డెక్‌లు ఉన్నాయి. 7500 నాటికల్ మైళ్ల ఓర్పుతో 28 నాటికల్ మైళ్ల గరిష్ట వేగంతో రూపొందిం చారు.
- ఐఎన్‌ఎస్ విక్రాంత్ నిర్మాణంలో విమాన వాహక నౌకలు నిర్మించగల సామర్థ్యం ఉన్న ఆరవ దేశంగా భారత్ నిలిచింది. అమెరికా, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనాలకు మాత్రమే ఆ సామర్థ్యం ఉంది.
- ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించింది, దీని డిజైన్ ని ఇండియన్ నేవీ వార్‌షిప్ బ్యూరో రూపొందించింది.
- 30 విమానాలు ఉండగలిగే సామర్థ్యం MIG-2K యుద్ధ విమానాలు, Kamov-31, MH-60R మల్టీ-రోల్ హెలికాప్టర్లు, అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు, తేలికపాటి యుద్ధ విమానాలను నిలుపగల సామర్థ్యం ఐఎన్‌ఎస్ విక్రాంత్‌కు కలిగి ఉంది.
- ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండిరగ్ ట్రయల్స్ నవంబర్‌లో ప్రారంభమవుతాయి, 2023 మధ్యలో పూర్తవుతాయి.
నౌకాదళానికి శివాజీ మహరాజ్ స్ఫూర్తి.. రూపు మార్చుకున్న పతాకం
భారత నావికా దళం నూతన పతాకంలో వలస పాలన బానిసత్వానికి గుర్తుగా నిలిచిన సెయింట్ జార్జి క్రాస్‌ను తొలగించి, ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తితో నూతన పతాకాన్ని రూపొందించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ స్ఫూర్తితో రూపొందించిన ఈ ‘నిశాన్’లో అనేక ప్రత్యేకతలున్నాయి. నౌకాదళం కొత్త చిహ్నంలో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. ఎడమవైపు పైభాగంలో మన జాతీయ పతాకం. ఇక రెండోది నీలం, బంగారు వర్ణంలో అష్టభుజాకారంలో ఉన్న చిహ్నం. ఈ అష్టభుజాకార చిహ్నంలో రెండు రెండు స్వర్ణ వర్ణపు హద్దులు.. నీలం రంగు మధ్యలో జాతీయ చిహ్నం ఉంది. దాని కిందనే ‘సత్యమేవ జయతే’ అనే అక్షరాలను దేవనాగరి లిపిలో నీలం రంగులో రాసి ఉంటుంది. ఈ జాతీయ చిహ్నం.. నౌక లంగరు ఆకృతిపై నిల్చున్నట్లుగా ఉంది. ఈ రెండిరటి కింద భారత నౌకాదళ నినాదం ‘సమ్ నో వరుణః’ అని దేవనాగరి లిపిలో బంగారు వర్ణంలో రాసి ఉంది. ‘వరుణ దేవుడా మాకు అంతా శుభం కలుగుగాక’ అని దీని అర్థం. ఈ అష్టభుజాకారం నౌకాదళ బహుళ దిశల పరిధి, బహుళ కార్యాచరణ సామర్థ్యాన్ని సూచిస్తుంది. లంగరు చిహ్నం ‘స్థిరత్వాని’కి గుర్తుగా రూపొందించారు. నీలం రంగు నావికాదళ సామర్ధ్యానికి ప్రతీకగా నిలుస్తుంది.
అష్టభుజాకారానికి ఆవృతమైన రెండు స్వర్ణ వర్ణపు హద్దులు శివాజీ మహరాజ్ రాజముద్రను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించారు. సముద్ర జలాలు, తీరాలపై అత్యంత దార్శనికత కలిగిన భారతీయ మహారాజుల్లో శివాజీ మహరాజ్ ముందు వరుసలో నిలుస్తారు. వారి హయాంలో అత్యంత విశ్వసనీయమైన నౌకాదళాన్ని నిర్మించారు. ఇందులో 60 యుద్ధ నౌకలు, దాదాపు 5వేల మంది నావిక దళం ఉండేదని నేవీ ఓ వీడియోలో పేర్కొంది. గతంలో భారత తీర రక్షణలో ఈ దళం అత్యంత కీలకంగా పనిచేసింది. పతాకంలోని శ్వేత వర్ణం భారతీయ నౌకాదళ సాధనాసంపత్తిని ప్రతిబింబిస్తుంది.