కృష్ణదాస్ ను విడుదల చేయాలి : ఇస్కాన్ డిమాండ్
హిందూ వ్యతిరేక బంగ్లాదేశ్ సర్కార్ ఇస్కాన్ కి చెందిన చిన్మోయ్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేసింది. దీనిపై ఇస్కాన్ స్పందంచింది. దీనిపై వెంటనే భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరింది. కృష్ణదాస్ ను వెంటనే విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తమ చిన్మోయ్ కృష్ణదాస్ ను ఢాకా పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్త తమకు తెలిసిందని, అక్కడి అధికారులు తమపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంది. దీనిపై వెంటనే భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా ఇస్కాన్ కోరింది. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం చర్చించాలని, తమది శాంతి, ప్రేమతో నడిచే భక్తి ఉద్యమమని వారికి తెలియజేయాలని ఇస్కాన్ సూచించింది.