బంగ్లాదేశ్ విడిచి వెళ్లొద్దు : హిందువులకు ఇస్కాన్ పిలుపు
బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వం నిత్యం హిందువులను హింసిస్తూనే వుంది. అంతేకాకుండా అక్కడి దేవాలయాలపై దాడులు చేస్తోంది. తాజాగా ఇప్పుడు ఇస్కాన్ సంస్థపై అక్కడి ప్రభుత్వం కత్తిదూసింది. ఇస్కాన్ భక్తులను చంపేస్తామని ఛాందసులు బహిరంగ ప్రకటనలే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ కృష్ణప్రభు అక్కడి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.
అక్కడి ప్రభుత్వం హిందువులను విభజించే కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. బంగ్లాదేశ్ నిజమైన సంతానం తామేనని ప్రకటించారు.‘‘మేము ఆర్యులం. ఈ నేల నిజమైన బిడ్డలం. ఈ దేశం వదిలి ఎక్కడికీ ఎవ్వరూ వెళ్లొద్దు. మనల్ని విభజించేందుకు కుట్రలు చేస్తున్నారు. అందరూ ఐకమత్యంతో కలిసి మెలిసి వుండాలి. విడిపోకండి’’ అంటూ స్వామి చిన్మయ్ కృష్ణప్రభు పిలుపునిచ్చారు.