బంగ్లాదేశ్ లో మరో హిందూ ఆలయంపై దాడి

మహ్మద్ యూనుస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువులపై నిరంతరం దాడులు చేస్తూనే వుంది. అక్కడి మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని పదే పదే ప్రకటనలు చేసినా, అది కార్యరూపం దాల్చడం లేదు. నిరంతరం హిందువులపై కక్షగట్టే క్రియలకే దిగుతోంది. మొన్న ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేసింది. ఇస్కాన్ ను నిషేధించడానికి కూడా ప్లాన్ వేస్తోంది. ఈ సమయంలో అక్కడి మత ఛాందసులు హిందూ దేవాలయంపై దాడి చేసి, ధ్వంసం చేశారు. చిట్టగాంగ్ లో వున్న లోకనాథ్ ఆలయంపై ముస్లిం ఛాందసులు దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇస్కాన్ ప్రతినిధి రాధారామన్ విడుదల చేశారు. ఈ వీడియోలో ముస్లింల ఉన్మాదం స్పష్టంగా కనిపిస్తోంది.
ముస్లిం ఛాందసవాదులు కర్రలు, రాడ్లు మరియు కత్తులతో వీధుల్లో బహిరంగంగా అరుస్తూ ఆలయంపై రాళ్లు రువ్వారు. దీనిపై భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సహా… ఇతర ప్రపంచ నాయకులు జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.దీనితో పాటు చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్ట్, మత ఛాందసవాదులు సాగిస్తున్న హింసను ఆయన విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *