చంద్రయాన్ -4 అభివృద్ధి దశలో ఉంది
‘‘చంద్రయాన్`4’’ అభివృద్ధి దశలో వుంది. అంతరిక్ష పరిశోధన అనేది నిరంతర ప్రక్రియ. ఇందులో భారత్ గొప్ప పురోగతిని సాధిస్తోంది. చంద్రుడిపై తదుపరి మిషన్‌కి ఇస్రో కట్టుబడి వుంది. అంతరిక్ష పరిశోధనతో పాటు సాంకేతిక అభివృద్ధి ప్రాజెక్టుల్లో దేశ వ్యాప్తంగా వున్న విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. చంద్రయాన్ 4 ప్రయోగంలో భాగంగా చంద్రుడిపై నుంచి మట్టి, నీళ్ల నమూనాలను భూమి మీదకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాం. 2040 వ దశకం ప్రారంభంలో చంద్రునిపై ల్యాండిరగ్ చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఇస్రో నిరంతరం దానిపై పనిచేస్తోంది.
ఇస్రో చైర్మన్ సోమనాథ్