సనాతనుల విశ్వాసమే గెలిచింది… ”రామ సేతు” కాల్పనికం కాదు… నిజమే : ఇస్రో ప్రకటన
రామసేతు విషయంలో హిందువుల విశ్వాసమే నిజమని మరోసారి బట్టబయలైంది. భారత్`శ్రీలంక మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదని, అది నిజమేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. అమెరికాకి చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్ 2 డేటాను వినియోగించి ఈ సేతకు సంబంధించిన మ్యాప్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఈ సేతువు పొడవు 29 కిలోమీటర్ల మేర వుంటుందని అంచనా వేశారు. దీని ఎత్తు సముద్ర గర్భం నుంచి 8 మీటర్లు వుంటుందని కూడా పేర్కొన్నారు. ఈ సేతువు తమిళనాడులోని రామేశ్వరం దీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకు విస్తరించి వుంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీనిని సున్నపురాతితో నిర్మించినట్లు కూడా కనుగొన్నారు. ప్రస్తుతం ఈ రామ సేతువు 99.98 శాతం నీటిలో మునిగిందని తెలిపారు.
వీటితో పాటు కొన్ని రహస్యాలను కూడా ఇస్రో వెలికి తీసింది. 2018 నుంచి 2023మధ్య అంటే దాదాపు 6 సంవత్సరాల కాల వ్యవధిలో కాల్ డేటాను సేకరించారు. 29 మీటర్ల పొడవు, సముద్ర గర్భం నుంచి 8 మీటర్ల ఎత్తులో వున్న సముద్రగర్భ మ్యాప్‌లో ఇదే మొదటిది. ఇస్రో జోధ్‌పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్తలు ప్రచురించిన ఒక పత్రికలో ‘‘నాసా శాటిలైట్’’ నీటిలో చొచ్చుకుపోయిన ఫోటాన్‌లను ఉపయోగించి వివరాలు సేకరించారు. ఇవే ఈ సేతువు మూలాలు తెలుసుకోవడానికి ఉపకరించాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే.. ఈ ప్రాంతంలో నీరు చాలా తక్కువ వుందని, అందుకే షిప్ మ్యాపింగ్ కష్టంగా వుందని పేర్కొన్నారు.
అయితే.. దీని కోసం అధునాతన లేజర్ టెక్నాలజీని శాస్త్రవేత్తలు ఉపయోగించారు. ఐసీఈసాట్ 2 లేజర్ పరిశోధకులకు నీటి భాగంలో లోతుగా చొచ్చుకుపోవడానికి సహాయపడిరది. దీని మార్గం 99.8 శాతం నిస్సారమైన, అతి నిస్సారమైన నీటిలో మునిగిపోయిందని ఆప్టికల్ శాటిలైట్ ఫొటో ధ్రువీకరిస్తుంది. ఈ మ్యాప్‌ను రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికా శాటిలైట్ నుంచి అధునాతన లేజర్ టెక్నాలజీని ఉపయోగించారు.