అది మసీదుకాదు దేవాలయమే
జ్ఞానవాపి వివాదాస్పద మసీదు కట్టడం ఒకప్పటి హిందూ దేవాలయం అన్న విషయం ఆధారాలతో సహా బయటపడింది. జ్ఞానవాపి మసీదు హిందూ దేవాలయమే అనే వాదన సరిగ్గా 31 ఏళ్ల క్రితం మొదలైంది. జ్ఞానవాపిపై ఎంతో హిందువులు ఆందోళనలు, నిరసనలు, న్యాయ పోరాటాలు చేశారు. చివరికి అది హిందూ దేవాలయమే అని తేలడంతో దేశ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేశారు.
ఔరంగజేబు హయాంలో కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని కూల్చివేసి ఆ ప్రదేశంలో జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేపట్టినట్టు చరిత్ర చెబుతుంది. జ్ఞానవాపి మసీదు వివాదంలో కీలక అంశాల విషయానికి వస్తే.. 1991లో వారణాసి కోర్టులో పిటిషనర్లు, స్థానిక పూజారులు జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో పూజలు చేసేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
16వ శతాబ్దంలో ఔరంగజేబు హయాంలో కాశీ విశ్వనాథ దేవాలయంలో కొంత భాగాన్ని కూల్చివేసి ఆయన ఆదేశాల మేరకు మసీదును నిర్మించారని పిటిషనర్లు ఆరోపించారు. పిటిషనర్లు కోరిన •× సర్వేపై స్టే విధించాలని 2019లో అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. ఐదుగురు హిందూ మహిళలు జ్ఞానవాపి మసీదు సముదాయంలోని శృంగార్ గౌరీ, ఇతర విగ్రహాలను పూజించు కోవాలని అనుమతి కోరడంతో ప్రస్తుత వివాదం మరింత ముదిరింది.
గత నెలలో వారణాసి కోర్టు ప్రాంగణంలోని పశ్చిమ గోడ వెనుక పూజలకు అనుమతి కోరుతూ ఐదుగురు హిందూ మహిళలు పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత జ్ఞానవాపి మసీదు సముదాయం వీడియోగ్రాఫ్ సర్వేకు కోర్టు ఆదేశించింది. సర్వే నివేదికను మే 10లోగా సమర్పించాలని తొలుత ఆదేశించింది.
జ్ఞానవాపి మసీదు సర్వే మే 16న ముగిసింది. సర్వే సందర్భంగా మసీదు కాంప్లెక్స్‌లోని వజూఖానా(నమాజ్‌కు ముందు ముస్లింలు కాళ్ళు, చేతులు కడుక్కునే ప్రదేశం) లో శివలింగం బయటపడింది. శివలింగం దొరికిన ప్రదేశాన్ని న్యాయస్థానం సీలు వేయాలని ఆదేశించింది. అయితే ముస్లిం పక్షం ఈ వాదనను తోసిపుచ్చింది. అది కేవలం ఫౌంటెన్ మాత్రమే అని వాదించింది.
అయితే ఆ కాలపు చరిత్రకారుడు.. సకీ ముస్తయిద్ ఖాన్ తన మాసిర్-ఎ-ఆలమ్‌గిరిలో ఆలయ కూల్చివేత గురించి ప్రస్తావించాడు. చక్రవర్తి ఆదేశం ప్రకారం, అతని అధికారులు కాశీలోని విశ్వనాథ ఆలయాన్ని కూల్చివేసినట్లు అందులో ఉంది.
ఇక జ్ఞానవాపి మసీదు పశ్చిమ గోడ వెనుక శృంగార గౌరీ, గణేశుడు, హనుమంతుడు, నంది విగ్రహాలు ఉన్నాయి. సాధారణంగా శివాలయాల్లో నంది విగ్రహాలు గర్భగుడికి కొంచెం దూరంలో.. శివలింగానికి అభిముఖంగా ఉంటాయి. కానీ.. ఇక్కడ ఉన్న నంది మాత్రం గర్భగుడి వైపు కాకుండా మసీదు వైపు చూస్తున్నట్లు ఉంటుంది. దీన్ని చూపిస్తూ.. జ్ఞానవాపి మసీదు విశ్వేశ్వర ఆలయానికి అసలు గర్భగుడి అని హిందూ పిటిషనర్లు కోర్టులో పిటిషన్‌లు వేసి న్యాయపోరాటం చేశారు. అయితే ఈ వాదనను మసీదు కమిటీ, మస్లీం సంఘాలు తప్పు పడుతూ వచ్చాయి.
చరిత్రను గమనిస్తే.. 4-5 శతాబ్దాల మధ్య కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. భారత దేశ పాలకుల్లో ప్రముఖుడైన విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. 1194లో మహ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్.. కన్నౌజ్ రాజును ఓడించినప్పుడు ఆ ఆలయాన్ని కూల్చివేసినట్లు చరిత్ర చెబుతోంది. 1211లో ఆలయాన్ని పునురుద్ధరిస్తే.. మళ్లీ 1489-1517 మధ్య సికందర్ లోఢీ హయాంలో కూల్చివేశాడు. ఇక ఔరంగజేబు మొఘల్ సింహాసనం సొంతం చేసుకున్న తర్వాత 1669లో మరోసారి ఆలయాన్ని కూల్చేశాడు. అప్పుడే విశ్వనాథుడి ఆలయమీదే మసీదు నిర్మించారు.
ఇప్పటికీ మసీదు దక్షిణపు గోడను పరిశీలిస్తే.. రాతి శిలా తోరణాలు స్పష్టంగా కనిపిస్తాయి. సాదారణంగా మసీదుల్లో ఇలాంటి శిల్పకళ ఎక్కడా కనిపించదు. కేవలం హిందూ దేవాలయాల్లో మాత్రమే ఇలాంటి శిల్పకళ కనిపిస్తుంది. ఔరంగ జేబు కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని కూల్చివేసిన స్థానంలోనే మసీదు కట్టినట్లు.. 1698లో అంబర్ రాజు బిషన్ సింగ్ చెప్పినట్లు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. మరాఠా సుబేదార్ మల్హర్ రావు హోల్కర్ కోడలు అహిల్యా బాయ్ హోల్కర్ హయాంలో కట్టిందే, మనకు ఇప్పుడు కనిపిస్తున్న కాశీ విశ్వనాథుడి ఆలయం.