దేశంలో వుండాలంటే వందే మాతరం పాడాలి : జగద్గురు రామభద్రాచార్య

పవిత్రమైన భారతమాతను మంత్రగత్తె అని పిలిచే వారిని ఏమాత్రం సహించమని జగద్గురు రామభద్రాచార్య హెచ్చరించారు. అక్బర్, బాబర్ లా తయారై, జీవిస్తామనుకునే వారు ఇక్కడ మనలేరని, ఇక్కడ నివసించాలనుకుంటే స్వామి తులసీదాస్, సూరదాస్, కబీర్ దాస్ లాగా జీవించాలని స్పష్టం చేశారు. భారత్ లో నివసించే ప్రజలందరూ వందేమాతరం పాడాలని, ఆవును తమ తల్లిగా పూజించాలని తేల్చి చెప్పారు. వందేమాతరం పాడని వారు పాక్ కి వెళ్లిపోవాలని సూచించారు.

సంభాల్ లోని కల్కి ధామ్ లో కల్కీ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి జగద్గురు రామభద్రాచార్య హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ‘‘మీరు జీవించండి, ఇతరులను జీవించనివ్వండి. అనేదే కల్కి సందేశం. అక్బర్ లేదా బాబర్ లా మారి ఇక్కడ ఎవ్వరూ జీవించలేరు. మీరు ఇక్కడ జీవించాలనుకుంటే స్వామి తులసీదాస్, సూరదాస్, కబీర్ దాస్ లాగా జీవించండి. భారత మాతను తల్లి అని పిలవండి, ఆవును తల్లి అని పిలవండి. మీరు భారత మాతను మంత్రగత్తె అని పిలస్తే దానిని సహించం’’ అని తేల్చి చెప్పారు. వందే మాతరం గానం చేయని వారు పాకిస్తాన్ కి వెళ్లి పోవాలని తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *