జాతీయ భావాలు, హిందుత్వాన్ని నిలబెడుతోంది జాగృతి పత్రిక : కాచం రమేష్

పత్రిక ప్రభావం సమాజంపై చాలా ఉంటుంది. మంచి పత్రిక చేతిలో ఉంటే మన గౌరవం పెరుగుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ అన్నారు. అలాగే జాగృతి పత్రిక మన చేతిలో ఉంటే మన గౌరవం కూడా పెరుగుతుందన్నారు. ఆదివారం సింధూ కాలనీలోని సింధూ భవన్‌లో జాగృతి పత్రిక పాఠకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదివే వాళ్ళు పత్రిక గురించి తమ అభిప్రాయాలు పంచుకోవడం గొప్ప విషయం అని తెలిపారు. ఇప్పుడు సమాజంలో చదివే అలవాటు చాలామందికి తగ్గిందని మూడు నుంచి ఐదు నిమిషాలు ఒక విషయం మీద వినే అలవాటు లేదు, పక్కింటికి వెళ్లే అవకాశం లేదని, ఒకరినొకరు కలుసుకోరని అన్నారు.
పత్రికలు, సాహిత్యం, పుస్తకాలు నిలబడే రోజులు ఇవి కావని, ఇంగ్లీష్ భాష ప్రభావం వల్ల తెలుగు వేగంగా కనుమరుగవుతుందని కాచం రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఇప్పటికే రాయలేని అనేక భాషలు కనుమరుగయ్యాయన్నారు. ఇంగ్లీష్ భాష మూలంగా తెలుగు చాలా దెబ్బతింటున్నదని, ఇలాంటి సమయంలో పత్రికను నడపడం చాలా కష్టమన్నారు.
1969 సంవత్సరంలో స్వయంసేవకులు ఆలోచించి ఢిల్లీలో పాంచజన్య అనే హిందీ పత్రిక, ఆర్గనైజర్ అనే ఆంగ్ల పత్రికలను ప్రారంభించగా, దేశంలో ఏది జరిగిన అది ముందుగా మన తెలుగు రాష్ట్రాలలో జరిగే దిశగా జాగృతి పత్రిక ప్రారంభించడం జరిగిందన్నారు. దేశ స్వాతంత్రానంతరం నిజాం నుండి 19 నెలల ఆలస్యంగా మన తెలుగు రాష్ట్రాలకు స్వాతంత్రం సిద్ధించిందని, ఈ విజయం తర్వాత జాగృతి పత్రిక మన దగ్గర ప్రారంభమైందని తెలిపారు. జాగృతి పత్రిక జాతీయ భావాలు, హిందుత్వం, నైతికత,విలువలు,దేశభక్తిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ వస్తుందని, ప్రారంభంలో విజయవాడ కేంద్రంగా కేవలం ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో ప్రారంభించబడి ఏకోపాధ్యాయ పాఠశాల తరహాలో అన్ని పనులు వారే చేసుకోవలసి వచ్చేదన్నారు.
అనేకమంది రాత్రింబవళ్లు కష్టపడి బ్లాక్ అండ్ వైట్ పత్రికను నడుపుతూ కలర్ పత్రికగా మార్పు చేశారని, ఇప్పుడు ఉన్న పత్రిక ఒకప్పుడు స్పెషల్ ఎడిషన్‌లో వచ్చేదన్నారు. పత్రిక ముఖచిత్రం మాత్రం కలర్ ఫుల్ గా ఉండేదని, చాలామంది ముఖచిత్రాన్ని చింపుకొని తమ తమ బీరువాలకు అతికించుకునేవారన్నారు. నెమ్మదిగా అనేకమంది ప్రయత్నం కారణంగా మంచి స్థాయిలోకి చేరుకుందని సంతోషం వ్యక్తం చేశారు. మనం కట్టే డబ్బులతో ఏ పత్రిక నడవదు బయట వారి సహాయ సహకారాలు పత్రికకు అవసరమన్నారు.
జాగృతి పత్రికకు ప్రారంభం నుంచి చందాదారులు ఉన్నారు కానీ మన పత్రిక ఇంకా మన శక్తి స్థాయి వరకు వెళ్లడం లేదన్నారు. మన పత్రికను తటస్థుల దగ్గరకి, మన వ్యతిరేకుల దగ్గరికి తీసుకువెళ్లాలని కాచం రమేష్ సూచించారు. బయట వారిని కనెక్ట్ చేయడానికి ఈ పత్రిక చాలా ఉపయోగపడుతుందని అన్నారు. తెలుగులో కొన్ని పత్రికలు కొన్నాళ్లు నడిచి ఆగిపోయాయని, కానీ … జాగృతి పత్రిక 77 సంవత్సరాల లో ఏ రోజు ఆగలేదని సగర్వంగా ప్రకటించారు. 19 నెలలు emergency విధించిన Indira Gandhi సమయంలోనే ఆగి, మళ్లీ నిరంతరాయంగా నడుస్తున్నదని, ఈ విధంగా అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ తెలుగులో పత్రికను నడుపుతున్నందుకు కార్యనిర్వాకులను చప్పట్లతో అభినందించాలన్నారు.ఈ సందర్భంగా కాచం రమేష్ జాగృతి పత్రిక సమాజానికి ఎందుకు అవసరం? దాని నేపథ్యాన్నిపాఠకులకు సవివరంగా వివరించారు.
RSS ప్రచారక్ నియమ,నిష్ఠలతో సంపర్కం చేస్తూ భోజనం కూడా లేకుండా చాలా దూరం ప్రయాణం చేసి ఒక చేతిలో తన లగేజ్ మరొక చేతిలో స్టవ్ పట్టుకొని ఎక్కడ వీలైతే అక్కడ వంట చేసుకుని తిని అక్కడి పిల్లల కొరకు పాఠశాలను ప్రారంభించారని, అలా ప్రారంభించబడిన శిశు మందిరాల్లో ఇప్పటివరకు సుమారు పది లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసించి IAS,IPS, మంత్రులుగా మరియు మంచి నాయకులుగా తయారయ్యారని అన్నారు. భద్రాచలంలో ఒక ఉపాధ్యాయుడు ఒకరి ఇంట్లో జాగృతి పత్రికను చూసి అందులో ఉన్న విషయాలను చదివి అసలు నిజాలను, ధర్మాన్ని తెలుసుకొని తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా వచ్చి శిశు మందిర్ పాఠశాలను ప్రారంభించారని తెలిపారు.
అలాగే మరో ఉదాహరణను కూడా వివరించారు. ”మన ఒకసారి RSS camp లో డాక్టర్ బీచుపల్లి గారు మాట్లాడారు. వారు చాలా బిజీ డాక్టర్ నిత్యం 50 నుంచి 100 మందికి వైద్యం అందిస్తారు. వారు దేశం గొప్పతనం మీద ఉపన్యాసం ఇచ్చారు. మీరు ఈ సబ్జెక్టు మీద ఇంత రీసెర్చ్ ఎలా చేశారు అని అడగగా నేను ప్రతిరోజు 10 నిమిషాలు జాగృతి పత్రికను పది నిమిషాలు పాంచజన్య పత్రికను చదువుతానని వారు తెలిపారు. ఈ పత్రిక పది సంవత్సరాలు చదివితే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయవచ్చు అని చెప్పారు.”
సమాజంలో జరుగుతున్న సంఘటనలపై ideological war నడపాలని సూచించారు. @RSS 100 పూర్తి చేసుకుని ఇంత బలంగా ఉన్నా విమర్శించే వారు పిడికెడు మందే అని, వాళ్లు సమాజంలో ఎక్కువ ప్రభావం చూపుతున్నారని,  దీనికి కారణం మనపై చేస్తున్న దుష్ప్రచారమే ఇది తగ్గాలంటే మనం సమాజాన్ని ప్రభావితం చేస్తే సరిపోతుందని, దీనికి జాగృతి పత్రిక ఓ సాధనంగా మారాలని కాచం రమేశ్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *