చెరుకు చేదు ఫలితమిచ్చినా… తీపి ఫలితమిచ్చినా .. 50 ఏళ్లుగా రైతులు మాత్రం దానివెంటే

దేశంలో వేలాది మంది రైతులు చెరుకు పంట సాగుచేస్తుంటారు. కొంత మంది రైతులు దీనిని సీజనల్ పంటగా పండిస్తుండగా… మరి కొందరు మాత్రం కేవలం చెరుకు పంటపైనే ఆధారపడుతుంటారు. చాలా సంవత్సరాలుగా తెలంగాణలోని జహీరాబాద్ నగరంలో మాత్రం గత 50 సంవత్సరాలుగా రైతులు ఇక్కడ చెరుకు పంటను మాత్రమే పండిస్తున్నారు. చాలా మంచి లాభాలను కూడా ఆర్జిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం జిల్లాలోని కొత్తూరు గ్రామంలో చక్కెర కర్మాగారం ప్రారంభమైంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కర్మాగారం కూడా మూతపడింది. అయినా సరే.. రైతులు ఢీలా పడిపోలేదు. ప్రత్యామ్నాయంగా ఆలోచించి, తాము పండించిన పంటను కర్నాటకకి తరలించడం ప్రారంభించారు.

 

ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాత్రం… అక్కడి రైతులు మాత్రం కొన్ని సంవత్సరాలుగా చెరుకు పంటకే అంకితమైపోయారు. 50 సంవత్సరాలుగా ఇదే పంటను సాగు చేస్తున్నామని పేర్కొంటున్నారు. తమకు కొంత కష్టమైనా… పుష్కలంగా లాభాలు వస్తున్నాయని, అందుకే తాము ప్రత్యామ్నాయం వైపు మళ్లడం లేదన్నాడు. ఎకరానికి ఒక్కో రైతు 60 వేల రూపాయల లాభాన్ని పొందుతున్నారు. మరింత రాబడి తీసుకురావడానికే తమ ప్రయత్నాలు చేసుకుంటున్నామన్నారు. అధిక దిగుబడి కారణంగానే తాము వేరే పంటను వేయడం లేదని కూడా తెలిపారు. చెరుకు ధర టన్నుకి 200 రూపాయలు తగ్గినా… తాము వేరే పంట వైపు చూడలేదని, చెరుకు మాత్రమే సాగు చేశామన్నారు. తమ ప్రాంతంలో ఓ చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం స్థాపించాలన్నదే తమ డిమాండ్ అని రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారు. తమకు ఇదే పంట వేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *