ఇప్పటి నుంచి జమ్మూ కశ్మీర్‌లోని అన్ని పాఠశాలల్లో జాతీయ గీత ఆలాపన… ఉత్తర్వులు జారీ
ఇప్పటి నుంచి జమ్మూ కశ్మీర్‌లోని అన్ని పాఠశాలల్లో కచ్చితంగా ప్రార్థనా సమయంలో జాతీయ గీతాన్ని ఆలాపించాలని జమ్మూ కశ్మీర్ విద్యాశాఖ కీలక ఆదేశాలిచ్చింది. ఉదయం నిర్వహించే అసెంబ్లీ విద్యార్థుల మధ్య ఐక్యత, క్రమశిక్షణను పెంపొందిస్తుందని విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సమయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం కోసం వక్తలను కూడా ఆహ్వానించాలని సూచించింది. జమ్మూ కశ్మీర్‌లోని అన్ని పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీ ఒకేరీతిలో జరపాలని కూడా పేర్కొంది. ఈ ఆదేశాలతో ఇకపై రోజూ జమ్మూ కశ్మీర్ పాఠశాలల్లో జాతీయ గీతం వినిపించనుంది. అలాగే ఉదయం జరిగే అసబంబ్లీలో డ్రగ్స్‌పై కూడా అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీఅయ్యాయి. మానసిక , శారీరిక శ్రేయస్సు ఫై మాదక ద్రవ్యాలు ఎలా ప్రభావం చూపిస్తాయో తెలిపాలన్నారు. మార్గదర్శకాల ప్రకారం అసెంబ్లీ వ్యవధి 20 నిమిషల్రుగా వుంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలోని పాఠశాలల్లో విద్యార్థులు ప్రార్థనా సమయంలో జాతీయ గీతాన్ని పాడుతారు. అయితే.. జమ్మూ కశ్మీర్‌లోని పాఠశాలల్లో మాత్రం కచ్చితంగా పాడాలన్న నియమం ఇప్పటి వరకూ లేదు.