జమ్మూకశ్మీర్‌కి త్వరలోనే రాష్ట్ర హోదా: ప్రధాని మోదీ
జమ్మూకశ్మీర్‌కి త్వరలోనే రాష్ట్ర హోదా వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయం ఎంతో దూరంలో లేదన్నారు. జమ్మూకశ్మీర్ ఉదంపూర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం ద్వారా ప్రజలు తాము కన్న కలలను సాకారం చేసుకోవచ్చని అన్నారు. ఉగ్రవాదం, దాడులు, రాళ్లదాడులు, కాల్పులు లాంటి భయం లేకుండా రాబోయే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ లో ఇప్పుడు అభివృద్ధి శకం నడుస్తోందని, పాఠశాలలకు నిప్పుపెట్టే పరిస్థితులు లేవని, ఇప్పుడు పాఠశాలలను బాగా అలంకరిస్తున్నారన్నారు. AIIMS, IITలు మరియు IIMలు నిర్మిస్తున్నారు.ఇప్పుడు ఆధునిక, విశాలమైన రోడ్లు, సొరంగాలు, వంతెనలు వచ్చాయన్నారు. జమ్మూ కానీ, కశ్మీర్ గానీ… రెండు ప్రాంతాల్లో భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.