ఉగ్రవాదులతో సంబంధాలున్న ఉద్యోగులను సస్పెండ్ చేసిన ఎల్జీ

ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలు నెరుపుతున్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ తొలగించారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు ఓ ప్రకటనను విడుదల చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ భద్రత నేపథ్యంలో అబ్ రహ్మాన్ నైకా, జహీర్ అబ్బాస్ అనే ఉద్యోగులను ఎల్జీ తొలగించారు. ఈ ఇద్దరూ ఇస్లామిక్ ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అన్ని రకాలుగా నిర్ధారించుకునే… ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అబ్ రెహ్మాన్ కుల్గం జిల్లాలోని దేవ్ సర్ నివాసి. మెడికల్ డిపార్టుమెంట్ లో అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఈయనకు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్ ముజాయిద్దీన్ తో సంబంధాలు్ననాయి. ఓ హత్య కేసులో విచారణ సందర్భంగా ఈ లింకులు బయటపడ్డాయి. అయితే… ఇస్లామిక్ ఉగ్రవాదులు తనకు కొన్ని లక్ష్యాలు నిర్దేశించారని, ఓ ఉగ్రదాడి చేయడానికి తన ప్లాన్ ఇచ్చారని అబ్ రెహ్మాన్ విచారణలో స్వయంగా అంగీకరించాడు. అండర్ గ్రౌండ్ వర్కర్ గా పనిచేస్తున్నాడు.
ఇక… మరో ఉద్యోగి జహీర్ అబ్బాస్ ను కూడా లెఫ్టినెంట్ గవర్నర్ విధుల నుంచి తొలగించారు. ఈయన కిష్త్వార్ లోని సరూర్ నివాసి. పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ.. ఇస్లామిక్ ఉగ్రవాదులతో పనిచేస్తున్నాడు.అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ అయిన జహీర్ 2012లో ఉపాధ్యాయునిగా నియమితుడై బుగ్రానాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరాడు. ఈయనకు కూడా ముజాయిద్దీన్ తో సంబంధాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *