భూసార సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం ‘గ్రామ భారతి’ ఆధ్వర్యంలో జన జాగరణ ఉద్యమం

భూమి సుపోషణ – భూసార సంరక్షణ -పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామ భారతి తెలంగాణా ఆధ్వర్యం లో ఉగాది పర్వదినం నుండి  జన జాగరణ ఉద్యమం జరగనుంది.  ఇందులో కొన్ని ధార్మిక సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భూమాత – భారతీయ దృష్టికోణం : “మాతా భూమి: పుత్రో అహం పృథివ్యా:”

1.ఈ భూమి నాతల్లి, నేను ఆమె పుత్రుడను. కన్నతల్లి, మాతృభూమి … స్వర్గం కంటే గొప్పవి

2.”జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ॥

3.భూమాత పట్ల దైవీ భావన, పూజ్య భావన…
It is to get Positive Energy

4.అవసరం మేరకే అనుభవించే సంస్కృతి… Our Culture is Agriculture.

5.ఈ తల్లితో అవినాభావ సంబంధం సేవాభావం… ఆరాధనా భావం!

6.ఇది జగజ్జనని, అన్నపూర్ణ, ఆరోగ్య ప్రదాయని ఇదియే భారత మాత!

అన్నపూర్ణగా భూమాత :

1.బంగారు నేలలు… బంగారు వంటలు: అమృత జలాలు పండ్లు, కూరగాయలు

2.సముద్రాలు – నదులు – లోయలు – వనాలు – కొండలు – గుట్టలు- సహజ వనరులు- భూగర్భజలాలు

3.కోటాను కోట్ల జీవ రాశులకు ప్రాణాధారం మానవ మనుగడకు సర్వం సమకూర్చే కన్నతల్లి.

4.జీవ వైవిధ్యాన్ని పోషించే తల్లి చరాచర సృష్టికి బ్రతుకుదెరువునిచ్చే అన్నపూర్ణ!

ఈనాడు మన భూమాత పరిస్థితి :

1. అడవుల నరికివేత, అధిక నీటి వినియోగం, భారీ యంత్రాల వాడకం

2. ప్రాణాంతక రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలు…… నిస్సారమైన భూములు

3. నేల – నీరు – గాలి, పంటలు – పండ్లు కూరగాయలు…. కలుషితమైన దుర్భర స్థితి

4. విచక్షణా రహితంగా సహజ వనరులు, వనస్పతులు, భూగర్భజలాల దుర్వినియోగం

భూమి సుపోషణ – పర్యావరణ సంరక్షణ : ఆవశ్యకత

1. భూమి సుపోషణ తో భూసార సంరక్షణ పర్యావరణ పరిరక్షణతో…. జీవ వైవిధ్యం కాపాడుట

2. చెట్లు, ఔషధ మొక్కలు, పూల మొక్కలు, కూరగాయ మొక్కలు, మిశ్రమ పంటలతో భూమికి బలం

3. గో పోషణ, పశు పోషణ, ఎద్దుల వ్యవసాయం తో భూమికి కడుపునిండా ఆహారం

4. భూమిలో వాన పాముల సంచారంతో నేల గుళ్లగా తయారగుట, నీటిధారలు ప్రవహించుట

భూమి సుపోషణ – భూసార సంరక్షణ : గ్రామాలలో చేయాల్సిన పనులు :

1. ఉగాది పండుగ లేదా మరొక రోజు… భూమి పూజ, భూ సుపోషణ గూర్చి సంకల్పం చేయించుట…

2. వేసవిలో లేదా ఒక్కొర్టు పంటకు మధ్య భూమికి విశ్రాంతి. భూమిని ఎండతాకిడి నుండి కాపాడుట.

3. భూమికి అచ్చారన (మల్చింగ్) మరియు రాప్ప (నీరు, నీటి ఆవిరి సంతులనం)

4. భూమిలో ఎల్లెడలా వానపాములు మరియు కోటాను కోట్ల జీవరాశుల సంచారం

5. గోపోషణ, పశుపోషణ, పొలంలో పశువుల మందలు, ఎద్దులతో వ్యవసాయం

6. నవధాన్యాలు, పప్పు ధాన్యాలు, స్వల్పకాలికి పంటలు, పచ్చి రొట్టలతో భూమికి పాదూ.

7. సేంద్రియ ఎరువులు, గో కృపామృతం, బీజామృతం, జీవామృతంలతో నేలకు సమృద్ధి ఆహారం

8. చెరువు మట్టి, మట్టి ద్రావణం, ప్రాకృతిక కీటక నియంత్రణ కషాయాల వినియోగం

9. మిశ్రమ పంటలు, పంట మార్పిడిని రైతులు తమ గ్రామానికి కావలసిన అన్ని పంటలు పండించుట

10. భూసారం, నీటి వనరులు, వర్షాలు, వాతావరణం.. వీటి ఆధారంగా పంటల విధానం మరియు రైతులు తమకు కావలసిన దేశవాళీ విత్తనాలు స్వయంగా తయారు చేసికొనుట.

11. తమ పొలంలో పడ్డ వర్షపు నీరు పొలంలో… గ్రామంలో పడిన వర్షం నీరు గ్రామంలోనే ర పోవుట

12. పాలంలో కాంటూర్ పద్ధతిలో నీటిని నిలిపే విధంగా గట్లువేసి, అధిక పంటలు పండించుట

13. పొలం గట్లపైన ఉపయోగ కరమైన చెట్లు మరియు గడ్డిని పెంచే విధంగా ఏర్పాటు చేసికొనుట

14. వ్యవసాయం పనులకు, కలుపు తీయుటకు… చేతితో, పశువులతో నడిచే చిన్న యంత్రాలు వినియోగించుట

15. యజమానులు తమ కుటుంబ సహితంగా కూలీలతో కలసి పొలం పనులు చేయుట

16. తమ పొలాన్ని, ఇంటిని, వీధిని, గ్రామాన్ని, ధార్మిక సమాజిక స్థలాలను పర్యావరణ పోషకంగా ఉంచుకొనుట

17. ఆహార వస్తువుల విలువ, విత్తనాల భద్రత కోసం… ప్లాస్టిక్ పాలిథిన్ రహిత పాత్రలు, గోనె సంచులు, గుడ్డ సంచులను ఉపయోగించుట

18. పంచ భూతాల సమ్మేళనంతో నే సృష్టి, పర్యావరణం, ప్రాణుల సంరక్షణ, మానవ వికాసం… వీటిని కాపాడుకొనుట

(1) నేల నుండి ఖనిజాలు

(2) మబ్బుల నుండి నీరు

(3) సూర్యుని నుండి సౌరశక్తి- అగ్ని

(4) గాలి వాతావరణం నుండి కార్బన్ డై ఆక్సైడ్

(5) ఆకాశం లోని 27 నక్షత్రాల నుండి విశ్వశక్తి (శబ్దం)

19. పొలాల్లో, ఇండ్లల్లో, వీధులలో, సామాజిక స్థలాలలో… అత్యధికంగా సౌరశక్తిని ఉపయోగించుట

20. గ్రామ పెద్దలు, ప్రభుత్వాధికారులు.. రైతులను ప్రోత్సహించుట, రైతును “రాజు” గా చేయుట.

నగరాలు – పట్టణాలు – మండల కేంద్రాలలో చేయదగు పనులు :

1. ‘ఉగాది’ నుండి ఏప్రిల్, మే, జూన్ మాసాలలో తమ బస్తీ కాలనీ అపార్ట్మెంట్ లలో… భూ సుపోషణ పర్యావరణ సంరక్షణ పట్ల సదవగాహన కల్గించుట.

ఏదేని ఒక పూజా విధి,

2. గ్రామాలు – పల్లెలతో పాటుగా… నగరాలు- పట్టణాల నివాసం, ఈ భూమాత పైననే అని గ్రహించాలి. భూ సుపోషణ కేవలం రైతుల బాధ్యత మాత్రమే కాదు, ప్రజలందరి కర్తవ్యమని తెలియజేయాలి.

3. తమ ఇంటిలో, పరిసరాలలో ప్లాస్టిక్, పాలిథిన్, ధర్మోకోల్, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, సిమెంట్ మొదలగు వాటి వినియోగాన్ని నియంత్రించాలి.

4 . ధార్మిక స్థలాలు, సామాజిక స్థలాలు, పండుగలు, శుభకార్యాలు, విందులు, వినోదాలలో ప్లాస్టిక్ – పాలిథిన్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలి.

5. తమ ఇండ్లలో తడి చెత్తను – పొడి చెత్తను విడిగా ఉంచాలి. తడిచెత్త మరియు మిగిలిపోయిన ఆహార పదార్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేసికొని, ఉపయోగించుకోవాలి.

6. మన ఇంటి పరిసరాలు, వీధులు, మురికి కాలువలు, చెరువులు, కుంటలు, సామాజిక స్థలాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

7. తమ ఇంటి పరిసరాలు, మిద్దెలు, దేవాలయాలు, పాఠశాలలు, సామాజిక స్థలాలతో అత్యధికంగా చెట్లు, మొక్కలు, కూరగాయలు పెంచుకోవాలి. (Terrace Gardening)

8. తను బస్తీ కాలనీ – అపార్ట్మెంట్లో సేంద్రియ విక్రయశాలలు మేళాలు నిర్వహించుకోవాలి.

9. సేంద్రియ ఆహార పదార్థాలు, గో ఆధారిత వస్తువులు, పంచగవ్య ఔషధాల కిట్స్ (Kits) తయారు చేసుకొని, మహిళలు, నిరుద్యోగ యువతీ యువకులు, తమ చుట్టుప్రక్కల ఇండ్లలో అమ్మకాలు

10. ఒక్కొక్క బస్తీ – కాలనీ – అపార్ట్మెంట్ దగ్గరలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి.

రైతులకు – గ్రామస్తులకు పెట్టుబడి సమకూర్చి అక్కడి నుండి తమకు కావలసిన ఆహార దినుసులు, పండ్లు, పాలు, గో ఆధారిత వస్తువులు తెప్పించు కోవాలి. రైతును ‘రాజు’ గా గౌరవించాలి.

సంకల్పం (ప్రతిజ్ఞ) :

(సూచన:- ఈ ప్రతిజ్ఞను ఒక వ్యక్తి పెద్ద స్వరంతో పలికించాలి. దానిని అక్కడున్న ప్రతి ఒక్కరూ ఉచ్ఛరించాలి.)

భారత దేశము నా మాతృభూమి భారత దేశములోని నా నివాసము
గ్రామం లేదా పట్టణము, ఏదైనప్పటికీ, భారతీయ సంస్కృతిలో భాగస్వామినై, ఈ భూతల్లి పట్ల మాతృభావనను కలిగియుండుటకు, నేను సర్వసన్నద్ధంగా ఉంటాను.
ఈ భూతల్లి పట్ల గల నా ఆదరాభిమానాలను, నా దినచర్య మరియు కర్తవ్యపాలనతో నిరూపిస్తాను.
ఈ భూమి సుపోషణ గూర్చి, నేను నా జీవితాంతం, ఈ క్రింది విధంగా శ్రమిస్తాను.

1. భూసారము దెబ్బతినకుండా అపుతాను, మట్టి సారవంతము కావడానికి కృషిచేస్తాను..

2. రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగుమందులు, రసాయనిక రోగ నిరోధక మందులు ఉపయోగించను.

3. వ్యవసాయములో పంటకు కావలసినంత మేరకే నీటిని ఉపయోగిస్తాను, ఎక్కడనూ నీటిని వృధా కానివ్వను.

4. చేలగట్ల పైన చెట్లు పెంచుతాను, జీవ వైవిధ్యాన్ని కాపాడుటకు కృషి చేస్తాను.

5. పై నియమాలను పాటించుటతో పాటుగా…… భూమి సుపోషణ కోసం, ఈ క్రింది పద్ధతులను అనుసరిస్తాను.

భూసారానికి హాని కలిగించే పదార్థములను,
ఉదా॥ ప్లాస్టిక్, ధర్మకోల్ మొదలైన వాటి వాడకం వీలైనంత తగ్గిస్తాను.

భూమికి హాని కలిగించే వస్తువులను జాగ్రత్తగా, అతి తక్కువగా, భూమికి హాని కలగని రీతిలో ఉపయోగిస్తాను.

కాగితాలు మరియు వృక్ష సంబంధ ఉత్పత్తులను అవసరమైనంతవరకే ఉపయోగిస్తాను.

ఈ ఉత్పత్తులను మరలా మరలా ఉపయోగించే పద్ధతులను పాటిస్తాను.

చెట్లు నాటి, వాటిని సంరక్షించే కార్యములో నేను ఎల్లప్పుడూ పాల్గొంటూ ఉంటాను.

ఈ పద్ధతులన్నింటినీ, నేను సంపూర్ణ విశ్వాసంతో, నిష్టతో పాటిస్తాను.

ఈ కార్యం లోనే నా దేశ సౌభాగ్యం, భూమాత ఔన్నత్యం ఆధారపడి ఉంటాయని నమ్ముతాను.

గ్రామ భారతితో పాటు, మన తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రింది ధార్మిక సామాజిక- సేవా సంస్థల భాగస్వామ్యంతో ఈ సత్కార్యాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేయుటకు ఆనందిస్తున్నాము.

భాగస్వామ్య సేవా సంస్థలు 1-9

భాగస్వామ్య ధార్మిక సంస్థలు 10-18

1. ఏకలవ్య ఫౌండేషన్

10. రామకృష్ణ మఠం

2. గో సేవా విభాగం

11. భారత్ స్వాభిమాన్ ట్రస్ట్

3. గో ఆధారిత రైతుమిత్ర సంఘం

12. వికాస్ తరంగిణి

4. భారతీయ కిసాన్ సంఘ్

13. రామచంద్ర మిషన్

5. స్వదేశీ జాగరణ మంచ్

14. గాయత్రీ పరివార్

6. వనవాసీ కళ్యాణ పరిషత్

15. ఆర్ట్ ఆఫ్ లివింగ్

7. సేవా భారతి

8. సహకార భారతి

9. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం

16. ఈశా ఫౌండేషన్

17. స్వాధ్యాయ

18. ఇస్కాన్

మనం నివాసం ఉన్న గ్రామం/బస్తీ లేదా అపార్ట్మెంట్ లలో జూన్ నెలాఖరులోపు పై సూచనలు పాటిస్తూ పై సంస్థల సహకారంతో భూ సపోషణ కార్యక్రమం నిర్వహించవచ్చు. ఇది మన అందరి కనీస బాధ్యత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *