జిహాదీ రాజకీయాలు – హిందూ మారణహోమం

స్వతంత్ర భారతంలో జరిగిన ఎన్నో హిందూ నరసంహారాలలో ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న ఉదంతం ఒకటి. హిందూ కార్యకర్తలను వెతికి మరీ హత్య చేసిన ఉదంతాలు దేశమంతా జరిగాయి, జరుగుతున్నాయి. కేరళ, బెంగాలు రాష్ట్రాల్లో వందల వేల సంఖ్యలో ఈ హిందూ ఊచకోతలు జరిగాయి. లెక్కలోకి కూడా రానివి మరెన్నో. దాదాపుగా ప్రతినెలా కనీసం 3-4 హిందు వుల మతద్వేషపూరిత హత్యలు జరుగుతున్నాయి. కేవలం వారు హిందువులు అయినందుకు మాత్రమే. 

దీనికంతటికీ, అసలు నేపథ్యం ఏమిటి? దక్షిణ కోస్తా కర్ణాటకలో ముస్లిం మతోన్మాదం హెచ్చుమీరి, హిందువులకి వ్యతిరేకంగా జిహాద్‌ ‌సాగిస్తున్నారు. ‘పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా (PFI)’ అనే మతోన్మాద సంస్థ, వాటి యువ క్రియాశీలక విభాగం ‘కాంపస్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా’ ద్వారా ఈ మొత్తం నాటకం రచించబడింది. దేశంలో, ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో, 20 సంవత్సరాల క్రితం లేని ఈ అరబ్‌ ‌సంస్కృతి ‘హిజాబ్‌’‌ని వీరు దిగుమతి చేసి, పాఠశాలలను / కళాశాలలను, రణరంగంగా మారుస్తున్నారు. ఈ పరాయి దేశాల దిగుమతి సంస్కృతి కోసం దేశమంతా వీరు జిహద్‌కి దిగుతున్నారు. ఈ దేశ సంస్కృతి, ఇక్కడి సమాజం, ఇక్కడి చట్టాలు, రాజకీయాలతో వీరికి ఏ సంబంధం లేదు అని వీరు బహిరంగంగానే వాదిస్తున్నారు.

ఈ క్రమంలో కొన్ని ప్రశ్నలు:

అ. గత రెండు నెలలుగా సాగుతున్న ఈ గొడవ లలో, స్కూల్‌ ‌యూనిఫారం బదులు, ఈ ముస్లిం విద్యార్థినులు, అరబ్‌ ‌బుర్ఖాలు తగిలించుకుని స్కూల్‌కి వస్తామంటే, ఉడుపి పాఠశాలలు ఎంతోకాలం వారితో, వారి తల్లిదండ్రులతో సంప్రదింపులు జరి పారు, వారికి ఎంతో నచ్చ జెప్పారు. అయినా వారు నియమాలు పాటించడానికి ఒప్పుకో లేదు. ‘‘చదువు కన్నా హిజాబ్‌/ ‌బుర్ఖాలే ముఖ్యమని’’ వారు అంటున్న ప్పుడు, స్కూల్‌ ఎం‌దుకు వారిని సస్పెండ్‌ ‌చేయలేదు?

ఆ. హిందూ విద్యార్థినీ విద్యార్థులు ఎదురు తిరిగి, వారు కూడా కాషాయ కండువాలు వేసుకుని పాఠశాలలకు వెళ్లకపోతే, అసలు ఈ విషయం బయటకి వచ్చేదా?

ఇ. బుర్ఖా తగిలించుకుని స్కూల్‌కి వెళ్ళడం, స్కూల్‌ ‌నియమాలను ఉల్లంఘించడమే. అయినా వారు ఆ పని చేస్తామని అంటే, అంతకు ముందు ఎన్నో కేసులలో సుప్రీం కోర్ట్ ‌కూడా, విద్యార్థులు నియమాలు పాటించా లని, మతపరమైన దుస్తులు వేసుకోకూడదని స్పష్టంగా చెప్పినా కూడా, ఈ కేసును కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఎందుకు స్వీకరించింది?

ఈ. హిజాబ్‌/‌బుర్ఖా వాదుల తరపున లాయర్లు, ఖురాన్‌ ‌లో ఏముందో, ఏమి లేదో తిరగదోడుతుంటే, కోర్టులు ఎందుకు ఇవన్నీ ఓపిగ్గా వింటున్నాయి? లౌకిక దేశంలో, లౌకిక చట్టాల ద్వారా, ప్రభుత్వ ధనంతో నడిచే పాఠశాలల్లో చదువుకోవడం కోసం, మతగ్రంథాల్లో ఏముందో తెలుసుకోవలసిన అవసరం ఏముంది?

ఉ. ప్రాథమిక హక్కులకి రాజ్యాంగం ఎన్నో పరిమితులు విధించిందని, లౌకిక దేశంలో, మత హక్కులకి పరిమితులు ఉంటాయని, ఈ దేశంలో మేధావులకి తెలియదా?

ఊ. ప్రభుత్వాలు, కోర్టుల వైఫల్యాల వల్ల పరిస్థితి విషమించుతోందని, మరెన్ని విషాదాలు చూడాల్సి వస్తుందో అని వారికి అర్ధం కావట్లేదా?

ఎంతమంది హిందువులు, ఈ మత జిహాద్‌కి బలి కావాల్సి వస్తుందో అని హిందూ సమాజం భయభ్రాంతులతో తల్లడిల్లుతోంది.

– ప్రదక్షిణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *