వైకల్యం ఉన్నా… ఓటు హక్కులో ఆదర్శంగా నిలిచిన గ్రామం ఇదీ…

ఓటు స్ఫూర్తిని  వందకి వంద శాతం చేసి చూపించింది జమ్మూ కాశ్మీర్ లోని   ఓ గ్రామం. ఆ గ్రామం పేరు ధడ్కాహి. ఇది ఉధంపూర్  లోకసభ పరిధిలోకి వస్తుంది. మంచు పర్వతాల్లో వుండే ఈ గ్రామంలో కేవలం 150 కుటుంబాలు మాత్రమే వుంటాయి. అయితే… అందులో ఎక్కువ కుటుంబాల్లో ఒకరు పుట్టుకతో మూగ, చెవుడు సమస్యను అనుభవిస్తున్న వారే. మొత్తంగా ఈ గ్రామంలో 84 మంది బధిరులు వున్నారు. వారిలో 43 మంది మహిళలు, 14 మంది చిన్నారులు. అయినా సరే… తమ వైకల్యం ఓటు వేసే ప్రక్రియలో ఏమాత్రం అడ్డంకిగా మారలేదు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ గ్రామ ప్రజలు ఉత్సాహంగా పోలింగ్ లో  పాల్గొన్నారు. ఓటు హక్కు వున్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకొని, అందరికీ ఆదర్శంగా  నిలిచారు. అయితే… ఈ గ్రామానికి ”సైలెంట్ విలేజె” అని పేరు వచ్చింది. ఎందుకంటే ఎక్కువ మంది బధిరులు వున్న కారణంగానే ఈ పేరు వచ్చింది. వారికి వైకల్యం వున్నా… దానిని తోజిరాజి ఓటు ప్రక్రియలో భాగం పంచుకున్నారు. అన్ని సౌకర్యాలు, అన్ని రకాల వసతులున్నా… ఓటింగన ప్రక్రియకు దూరంగా వుంటున్న వారినే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ గ్రామం అందరికీ ఆదర్శం గా  నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *