స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో ‘‘జాబ్ మేళా’’
స్వదేశీ జాగరణ్ మంచ్ తెలంగాణ ఆధ్వర్యంలో ‘‘ఉద్యోగ మహోత్సవ్’’ (జాబ్ మేళా) జరగనుంది. ఈ నెల 11న ఉదయం 10 గంటలకు కరీంనగర్ లోని బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఈ మేళా జరుగుతుంది. ఈ మేరకు స్వదేశీ జాగరణ్ మంచ్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ జాబ్ మేళాలో 100 కంపెనీలు పాల్గొంటాయని, 5000 పైగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని పేర్కొంది. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు వినియోగించుకోవాలని కోరింది. మరిన్ని వివరాలకు 9949355389 నెంబర్ కి సంప్రదించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ పేర్కొంది.