జో బైడెన్‌ ‌దంపతులకు భారతీయ సంప్రదాయ బహుమతులు

జూన్‌ 21-24 ‌తేదీల మధ్య ప్రధాని అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి బిడెన్స్ ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు సందర్భంగా నేతలు బహుమతులు ఇచ్చిపుచ్చు కున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రధాని మోదీ ఓ ప్రత్యేక చెక్క పెట్టెను అందజేశారు. ప్రాచీన భారతీయ గ్రంథమైన కృష్ణ యజుర్వేదంలో పేర్కొన్న ‘దృష్ట సహస్రచంద్ర’ అని రాసిన పత్రాన్ని అందులో ఉంచారు. అంటే.. వెయ్యి నిండు చంద్రులను (సహస్ర పూర్ణ చంద్రోదయం) చూసిన వ్యక్తి అని అర్థం. సహస్ర పూర్ణ చంద్రోదయం సందర్భంగా దశ దానాలను చేయడం ఆనవాయితీ. అందుకే అందులో వెండితో తయారు చేసిన గణేషుడి ప్రతిమ, ఓ దీపంతోపాటు చిన్న పాత్రల్లో బెల్లం, ధాన్యాలు, వస్త్రం, వెన్న వంటి ఇతర వస్తువులను అందజేశారు. అలాగే ‘ది టెన్‌ ‌ప్రిన్సిపల్‌ ఉప నిషత్తులు’ పేరుతో ఒక పుస్తకాన్ని బైడెన్‌కు మోడీ బహుకరించారు. ఐరిష్‌ ‌కవి విలియం బట్లర్‌ ‌యేట్స్‌పై అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ ఎప్పుడూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రెసిడెంట్‌ ‌బిడెన్‌ ‌తరచుగా యేట్స్ ‌కవిత్వాన్ని, రచనలను ఉటంకిస్తూ, తన బహిరంగ ప్రసంగాలు చేశాడు. యేట్స్ ‌భారతీయ ఆధ్యాత్మికత పట్ల ప్రభావితమయ్యారు. రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌తో ఉన్న స్నేహం, అభిమానం వల్ల పాశ్చాత్య ప్రపంచంలో ఠాగూర్‌ ‌గీతాంజలిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి అతను సహాయం చేశాడు. అమెరికా ప్రథమ మహిళ జిల్‌ ‌బిడెన్‌కు ల్యాబ్‌లో పెరిగిన 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు. వజ్రం భూమి నుండి తవ్విన వజ్రాల రసాయన, ఆప్టికల్‌ ‌లక్షణాలను ప్రతిబింబిస్తుంది.  సౌర, పవన శక్తి వంటి పర్యావరణ వైవిధ్య వనరులను దాని తయారీలో ఉపయోగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *