జొన్నలు
రుచికి వెగటుగా ఉంటుంది. శరీరంలో కఫం, పైత్యాన్ని హరిస్తుంది. వీర్యవృద్ధి బలాన్ని ఇస్తుంది.
జొన్నలలో ఎరుపు, తెలుపు, పసుపు మూడు రంగుల జాతులు ఉంటాయి.
జొన్నలలోని మాంసకృత్తుల్లో మనకు అవసరమయిన అన్ని ఎమైనో ఆసిడ్స్ తగినంతగా లభ్యం అవుతాయి. వీటిలో విటమిన్ దీ కాంప్లెక్స్, సెల్యూలోజులు సమృద్ధిగా లభిస్తాయి.
జొన్న రొట్టెలను మంచి బలవర్ధకమైన ఆహారం. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అయితే జీర్ణశక్తి తక్కువ ఉన్నవారు తినకూడదు.
జొన్నలలో అధికంగా ఉన్న ‘‘ఫైటేట్స్’’ అనే పదార్థం వలన మిగతా ఆహారపదార్ధాలలోని క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజ లవణాలు శరీరానికి పట్టడం కష్టం అవుతుంది. కాబట్టి జొన్నలను పరిశుభ్రంగా శుద్ధిచేసి పిండిమరలో వేసి మెత్తగా పిండిచేసి ఆహారంలో ఉపయోగిస్తుంటే ఫైటేట్స్ అడ్డురావు. దీనివల్ల ఐరెన్, క్యాల్షియం ఒంటికి పడతాయి.
మంచిగా శుద్ది చేసిన జొన్నపిండిని పాలతో కాని, మజ్జిగలో కాని కలిపి తాగుతుంటే మొలలు, అజీర్తి, దీ1, దీ2 లోపంతో బాధపడేవారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
జొన్నలను కడుపులో గుల్మాలు ఉన్నవారు, మొలలు సమస్య ఉన్నవారు తీసుకోరాదు . జొన్నలు అధికంగా తీసుకోవడం వలన నేత్రసంబంధ సమస్యలు వస్తాయి. జొన్నలకు విరుగుళ్లు పాలు, నెయ్యి, మిఠాయి, వాము.
– ఉషాలావణ్య పప్పు