కందకుర్తిలో అహల్యా బాయి ఘాట్
తెలంగాణలోని ఇందూర్ జిల్లా కందకుర్తి గ్రామంలో గోదావరి, మంజీరా, హరిద్ర నదుల త్రివేణి సంగమం యొక్క ఘాట్‌కి అహల్యా బాయ్ హోల్కర్ ఘాట్ అని నామకరణం చేశారు. అహిల్యబాయి హోల్కర్ 300 జయంతి ఉత్సవాల సందర్బంగా సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో కార్యకర్తలు, గ్రామస్థులు నదీ ఘాట్ ల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. 1725 నుండి 1795 మధ్యకాలంలో లోకమాత అహల్య బాయి హోల్కర్ దేశమంతటా 150 కి పైగా దేవాలయాలు, ఘాట్‌లను పునరుద్ధరించారు.
తెలంగాణలోని కందకుర్తి గ్రామంలోని త్రివేణి సంగమంలో అహల్యా బాయి హోల్కర్ ఒక శివాలయం నిర్మించినట్లుగా చరిత్ర తెలియ చేయటమే కాకుండా ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. ఈ సందర్బంగా ఈ సంవత్సరం వివిధ కార్యక్రమాల యోజన జరిపి కందకుర్తి కేంద్రంగా లోకమాత అహిల్యా బాయి భావాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని సమరసత వేదిక సంకల్పించింది.
ఈ ఘాట్ శుద్ధి కార్యక్రమంలో ఘాట్ కమిటీ అధ్యక్షులు మెత్రి సురేష్,దేవాలయం కమిటీ చైర్మన్, మాజీ చైర్మన్ గంగరాజు, ఉప సర్పంచ్ యోగేష్, సమరసత వేదిక కార్యదర్శి సుజన్ రెడ్డి, విజయ్, కన్వీనర్ గంగనర్సయ్య,వెక్టర్ కళాశాల లెక్చరర్ గజానన్, చెన్న కేశవ సేవా సమితి సహాయ కార్యదర్శి దేవోల్లా గోవింద్, శిశు మందిర్ ప్రధాన ఆచార్య ఆర్ముర్ సతీష్, సాయికుమార్ ఉమ్మడి నగేష్, ఆచార్య రాజేశ్వర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు