ఆ కాలనీ నిండా చెట్లే… ఒక్కో చెయ్యి వేసి, హరిత కాలనీ చేసుకున్నారు

అందరూ కలిశారు. ఒక్కో చేయి వేశారు. ఒక్కో చెట్టును నాటారు. ఇప్పుడు అవే పెద్ద పెద్ద చెట్లుగా మారి, నీడనిస్తున్నాయి. ఆ కాలనీలకే అందాన్ని తెచ్చి పెట్టాయి. కరీంనగరంలోని తిరుమలనగర, రామచంద్రాపూర కాలనీ, శ్రీహరినగరం కాలనీ, సప్తగిరి కాలనీ, విద్యానగరన, అంజనీ నగరన, ఆర్టీసీ కాలనీ, వావిలాపల్లి కాలనీల్లో ఇది కనిపిస్తుంంది. కాలనీ సంఘాలుగా ఏర్పడి, కమిటీలు వేసుకున్నారు. మొదటగా కాలనీలో వున్న పిచ్చి మొక్కలన్నింటినీ అందరూ కలిసి తొలగించారు. దీని తర్వాత మొక్కలు అందరూ కలిసి నాటారు. ఆ మొక్కలే ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లుగా అందరికీ నీడనిస్తున్నాయి. అలాగే అందాన్ని కూడా ఇస్తున్నాయి. ప్రతి రోజూ అక్కడ వంతుల వారీగా ఆ మొక్కలకు నీరు కూడా అందించేవారు. ఇందులో కుటుంబాలు కూడా పాల్గొనేవి. అప్పుడెప్పుడో నాటిన మొక్కలు ఇప్పుడు వేసవి కాలంలో నీడనిస్తున్నాయి.

చిన్న పిల్లలకు వేసవి సెలవులు కూడా దగ్గరపడటంతో వాటి కింద ఆడుకోవడానికి కూడా బాగా పనికొస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 100 మొక్కలను నాటారు. ఇలా చేసి నగరంలోనే అందరికీ నిలిచారు. ఇలా చేయాలని తమంతట తామే భావించి, ముందుకు వచ్చినట్లు కాలనీ వాసులు చెబుతున్నారు. ప్రభుత్వ సహకారం అంతంత మాత్రమే వుంది. అయినా.. పచ్చదనం కోసం తామే అందరమూ కలిసి మొక్కలు నాటామని, ఇప్పుడు చెట్లుగా ఎదిగి, తమకెంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయని కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

ఇక రెండో పని కూడా చేసి… వారి వార్తల్లో నిలిచారు. కాలనీల్లో వున్న గుంతలు, కుంటలను కూడా బాగు చేసుకున్నారు. గతంలో నడవడమే తమకు అత్యంత ఇబ్బందిగా వుండేదని, తమంతట తామే బాగు చేసుకున్నామని తెలిపారు. వీటితో పాటు కొత్తవాళ్లు ఇంటి అడ్రస్సులను వెంటనే గుర్తించడానికి వీలుగా చిరునామా బోర్డులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోడ్డు వెంబడి నడుస్తుంటే ఇంటి నెంబర్లతో పాటు వీధి నెంబరు కూడా వుంటుంది. ప్రతీ బోర్డుపై ఇళ్ల వివరాలను వుంచారు. ఇలా చేయడం ద్వారా అత్యంత సులువుగా అడ్రస్సులు తెలుసుకోవచ్చని వారి అభిప్రాయం. వీటితో పాటు వివిధ సమయాల్లో కాలనీ వాసులు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. పండుగల సమయాల్లో నిరుపేదలకు డబ్బు సాయం కూడా చేస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *