మరో కారిడార్
బీహార్‌లోని నలంద వర్శిటీతో పాటు నలంద `రాజ్‌గిరి కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నలంద యూనివర్శిటీని అద్భుతమైన స్థాయికి పునరుద్ధరించడంతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడిరచారు. మరోవైపు పర్యాట కాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కాశీ కారిడార్ తరహాలో మహాబోధి, విష్ణుపాద్ కారిడార్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మన నాగరిక తలో పర్యాటకం అనేది ఎప్పుడూ ఓ భాగమేనని, భారత్‌ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు.
దీని ద్వారా కొత్త ఉద్యోగాలను కల్పిస్తామని, ఇతర రంగాలలో కూడా కొత్త అవకాశాలను సృష్టిస్తాయన్నారు. గయలోని విష్ణుపాద దేవాలయం, బోధగయలోని మహాబోధి దేవాలయం చాలా ముఖ్యమైన ప్రదేశాలని, కాశీ విశ్వనాథ్ కారిడార్ తరహాలో రెండుచోట్ల కారిడార్లను నిర్మిస్తామన్నారు. తద్వారా అవి ప్రపంచ పర్యాటక కేంద్రాలుగా మారుతాయన్నారు. వీటితో పాటు పాట్నా‘పూర్నియా ఎక్స్‌ప్రెస్‌వే, బక్సర్’ భాగల్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే, బుద్ధగయ`రాజ్‌గిర్ వైశాలి దర్భంగా ఎక్స్‌ప్రెస్‌వే కూడా నిర్మిస్తామన్నారు. బక్సర్‌లోని గంగా నదిపై రెండు లైన్ల వంతెనను కూడా నిర్మించనున్నారు. దీనికోసం 26000 కోట్లను ఖర్చు చేస్తామన్నారు.
బుద్ధగయలో వున్న మహాబోధి ఆలయం పురాతన బౌద్ధ దేవాలయాలలో ఒకటి. క్రీ.పూ. 3 వ శతాబ్దంలో అశోక చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆలయం ఎత్తు 52 మీటర్లు. ఇందులో బంగారు బుద్ధుని విగ్రహం ఉంది. ఇక్కడే బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు. అందుకే ఈ ఆలయం బౌద్ధ సన్యాసులకు అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు.
గయలో విష్ణుపాద ఆలయాన్ని 18వ శతాబ్దంలో రాణి అహల్యాదేవి పునర్నిర్మించారు. పితృపక్షం సందర్భంగా దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడి వస్తుంటారు. పూర్వీకులకు పూజలు చేసిన తర్వాత, ఈ ఆలయంలోని విష్ణు పాదాలను దర్శిస్తే.. సర్వ దుఃఖాలు నశించిపోతాయని భక్తుల నమ్మకం.