కరువు ప్రాంతంలో దానిమ్మ పంట వేసి… 95 లక్షలు సంపాదించిన కర్నాటక రైతు
కర్నాటకలోని చిక్కమంగళూరు ప్రాంతంలో ఓ రైతు ఈ మధ్యే వ్యవసాయంలో విజయం సాధించి, దేశ వ్యాప్తంగా పేరు గడించాడు. ఆ రైతు పేరు రమేష్. వయస్సు 45 సంవత్సరాలు. ఈయన గ్రామం హుల్లేహళ్లి. అతనికి వుండే 8 ఎకరాల సాగు భూమిలో ఈ సారి దానిమ్మ పంటను సాగు చేశాడు. దాదాపు 20 లక్షలు ఖర్చైంది. అయితే.. అది చేతికి వచ్చిన తర్వాత మార్కెట్ లో విక్రయించగా 95 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. నిజానికి హుల్లేహళ్లి అనేది కరువు పీడిత ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఇంత విజయం సాధించాడు. అంతేకాకుండా మొదటి సారే ఈ పంటను వేసి, విజయం సాధించడం అనేది చెప్పుకోదగ్గ వార్త.
రమేష్ పండించిన ఈ పంట కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతులు చేస్తున్నాడు. మన దేశంలో తమిళనాడు, చెన్నై, బెంగళూరు, మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నాడు. ఇక విదేశాలు తీసుకుంటే శ్రీలంక, బంగ్లాదేశ్ కి దానిమ్మను పంపుతున్నాడు. 160 రూపాయలకు కిలో చొప్పున అమ్ముతున్నాడు.వీరి చుట్టుపక్కల ప్రాంతాల రైతులు కూడా సాగు చేశారు కానీ… ఇంతలా లాభాలు పొందలేదు.
నిజానికి ప్రపంచంలోనే ఎక్కవు శాతంలో దానిమ్మను ఉత్పత్తి చేసే దేశాల్లో మన భారత్ ఒకటి. నేల నాణ్యత, వాతావరణం, సాగుపద్ధతులు, మార్కెట్ డిమాండ్ వంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న రైతు లాభాలు గడించాడు.
దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో దానిమ్మకి బాగా డిమాండ్ వుంది. ఇది ఓ ప్రసిద్ధమైన పండు. దీంతో ఈ పంట లాభదాయకం.
2. దానిమ్మలు తొందరగా పాడవవ్వు. ఎక్కువ కాలం నిల్వ వుంటాయి. దీంతో విక్రేతలు నష్టపోరు.
3. ఆరోగ్య పరంగా కూడా లాభాలు. దీంట్లో విటమిన్లు, మినరల్స్ వుంటాయి. దీంతో ఇదో పోషకాహారం. పండ్ల మార్కెట్ ను కూడా పెంచుతుంది.
4. నిర్వహణ విషయంలో కూడా దానిమ్మకి తక్కువే. ఇతర పండ్ల కంటే తక్కువ నీరు, తక్కువ ఎరువులు పడతాయి.
5. దానిమ్మ కరువును కూడా తట్టుకోగదు. పరిమిత నీటి వనరులున్న ప్రాంతాల్లో కూడా సాగు చేయవచ్చు.
దీని ఆధారంగా చేసుకొనే రమేష్ అనే రైతు 95 లక్షల రూపాయల లాభాలను ఆర్జించి, వార్తల్లోనిలిచారు.