ధర్మస్థల కేసును NIA కి అప్పగించండి : స్వామీజీల డిమాండ్
ధర్మస్థల దేవాలయ వివాదం నేపథ్యంలో కర్నాటకలోని వివిధ మఠాల పీఠాధిపతులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ధర్మస్థల కేసు విషయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తూ, ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ అంశాన్ని కర్నాటక హోంమంత్రితో కూడా పీఠాధిపతులు చర్చించగా, నిరాకరించారు. దీంతో పీఠాధిపతులు కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు. ధర్మస్థల వివాదం తీవ్రత అధికమైందని, అందుకే ఆ తీవ్రతను తెలియజేయడానికే తాము కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యామని స్వామీజీలు ప్రకటించారు.
అసలు ఈ విషయం వెనుక, కుట్ర వెనుక ఎవరున్నారో తెల్చడానికి ఎన్ఐఏతో దర్యాప్తు అవసరమని, ఎన్ఐఏ దర్యాప్తు చేయాలని స్వామీజీలు డిమాండ్ చేశారు. దీని వెనుక హిందూ సంస్థలను బలహీనపరచడం, కించపరచడం అన్న కుట్ర దాగి వుందని స్వామీజీలు పేర్కొన్నారు. అందుకే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం ధర్మస్థలానికి సంబంధించిన అంశమే కాదని, ఇతర పుణ్య క్షేత్రాలను కూడా లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని స్వామీజీలు పేర్కొన్నారు.