కరివేపాకు 

దీనిని రావణ, గిరి నింబిక, మహానింబ అని కూడా పిలుస్తారు.  ఈ చెట్టుకు ప్రతిరోజు బియ్యం కడిగిన నీరు పోస్తూ ఉంటే లేత కరివేపాకు చెట్లు ఏపుగా ఎదుగుతాయి. అదే విధంగా ముదురు చెట్లకు బియ్యం కడిగిన నీరు పోస్తే వాటి ఆకులు మంచి సువాసనలు వెదజల్లుతాయి.

–  ఈ కరివేపాకు మన ఆహారంలో భాగం చేసుకోవడం వలన శరీరంలో కఫం, వాతాన్ని పోగొడుతుంది.

–  అగ్నిదీప్తి ఇస్తుంది.

– దీనిని ప్రతిరోజు తీసుకోవడం వలన గ్రహణి రోగం అనగా విపరీతమైన జిగురుతో కూడిన విరేచనాలు తగ్గుతాయి.

–  ఈ కరివేపాకు ముద్ద చేసి విష జంతువుల కాట్లకు, దద్దుర్లకు ఉపయోగిస్తారు.

–  కరివేపాకు చెట్టు ఆకుల కషాయం కలరా వ్యాదిని కూడా నివారిస్తుంది.

–  కరివేపాకు, మినపప్పు, మిరపకాయలు కలిపి నేతిలో వేయించి రోటిలో నూరి దాంట్లో కొంచం ఉప్పు వేసి నిమ్మకాయ రసం పిండి తయారుచేసే కారానికి కరివేప కారం అంటారు. ఈ పచ్చడి శరీరంలో పైత్యాన్ని తగ్గించి, అరుచిని పొగొడుతుంది.

– ఉషాలావణ్య పప్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *