కశ్మీర్ లోని చినార్ చెట్లకు ఆధార్ నెంబర్..

జమ్మూ కశ్మీర్ సాంస్కృతిక వారసత్వ చిహ్నమైన చినార్ చెట్ల రక్షణ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెట్ల పరిస్థితిపై డేటాబేస్ కోసం డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి చెట్టును జియో ట్యాగింగ్ చేసి, క్యూఆర్ కోడ్ ను కేటాయిస్తారు.దీంతో చినార్ చెట్టు వున్న ప్రాంతం, పెరుగుదల, ఆరోగ్య స్థితిని తెలుసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. పట్టణ పెరుగుదల, అడవుల తరగుదల వల్ల చినార్ వృక్షాలే కనిపించకుండా పోతున్నాయి. దీంతో వాటిని రక్షించాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకోసం ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూటషన్ సంస్థ ట్రీ ఆధార్ తో ముందుకు వచ్చింది. ప్రస్తుతానికి 28,500 చినార్ వృక్షాలను గుర్తించామని, వాటి వివరాలను కూడా నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఇక.. ఈ ప్రక్రియ కొనసాగుతుందని కూడా ప్రకటించారు.

1947కి ముందు జమ్మూ కశ్మీర్ లో చినార్ల సంఖ్య 45వేలకుపైగా ఉండేది. 1980 తరువాత వాటి సంఖ్య తగ్గడం ప్రారంభమైంది. 2017లో నిర్వహించిన లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 35వేల చినార్ చెట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో నాటిన చెట్లు కూడా ఉన్నాయి. అయితే, 2020 నుంచి అక్కడి ప్రభుత్వం చినార్ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. చినార్ దినోత్సవం రోజు కొత్త మొక్కలు నాటుతారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *