కేదార్ నాథ్ ఆలయం దర్శనం ప్రారంభం… గంగోత్రి, యమునోత్రి కూడా
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకుంది. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అధికారులు ఉదయం 7 గంటలకు ప్రధాన ద్వారాలు తెరిచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కుటుంబ సమేతంగా తొలి పూజలకు హాజరయ్యారు. ఈ రోజే ఆలయం తెరుచుకోవడంతో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఆరు నెలల తర్వాత ఆలయం తెరుచుకోవడంతో అధికారులు ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. దాదాపు 40 క్వింటాళ్ల పూలతో అలంకరించారు.
ఇక… యమునోత్రి ఆలయాన్ని కూడా ఉదయం 7 గంటలకు తెరిచారు. గంగోత్రి ఆలయాన్ని మాత్రం మధ్యాహ్నం 12:20 నిమిషాలకు తెరిచారు.ఇక.. బదరీనాథ్ ఆలయాన్ని మాత్రం మరో రెండు రోజుల తర్వాత తెరుస్తామని ట్రస్టీ పేర్కొంది. దాదాపు 16 వేల మంది మొదటి రోజు దర్శించుకున్నారు. గత యేడాది భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు ఈ సారి కూడా ఎక్కువ సంఖ్యలోనే వస్తారని ట్రస్ట్ పేర్కొంది. కేదార్ ధామ్‌కి 16 కిలోమీటర్ల ఉందే గౌరీకుండకు సుమారు 10 వేల మంది భక్తులు చేరుకున్నారు. గతేడాది కంటే నాలుగు వేల మంది ఎక్కువగా వచ్చారు. చార్‌ధామ్ యాత్రకు 55 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా … ఈ సారి ప్రారంభం కాకముందే 22.15 లక్షల మంది చేసుకున్నారు.