కేదార్ నాథ్, యమునోత్రి ఆలయాల మూసివేత

శీతాకాలం సందర్భంగా కేదార్ నాథ్, యమునోత్రి ఆలయాలను మూసేశారు. వేద మంత్రోచ్చారణలు, వేలాది మంది భక్తుల మధ్య కేదార్ నాథ ఆలయం ఆదివారం ఉదయం 8:30 గంటలకు మూసేశారు. ఈ సందర్భంగా పరమ శివుడి ఉత్సవ విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చి ఉఖిమఠ్ కి తరలించారు. శీతాకాలం అంతా కూడా అక్కడే పూజాదికాలు కొనసాగుతాయని అర్చకులు తెలిపారు. ఈ మూసివేత సందర్భంగా దర్శనం కోసం 18 వేల మంది భక్తులు అక్కడి వచ్చారు. జై బోలోనాథ్ అంటూ నినదించారు. ఈ యేడాది కేదార్ నాథ్ ను 16.5 లక్షల మంది దర్శించుకున్నట్లు ట్రస్టు పేర్కొంది. మరోవైపు యమునోత్రి ఆలయాన్ని కూడా అధికారులు మూసేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *